మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు-2026: నామినేషన్ల దాఖలుకు తుది గడువు 2026 జులై 31


5 ఏళ్ల మొదలు 18 ఏళ్ల వయసు బాలబాలికలు అర్హులు

స్వీయ నామినేషన్లతో పాటు
ఇతర వ్యక్తుల సిఫారసులను కూడా స్వీకరిస్తారు

प्रविष्टि तिथि: 09 JUN 2026 3:48PM by PIB Hyderabad

‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు (పీఎమ్ఆర్‌బీపీ)-2026’ను ప్రదానం చేయడానికి  మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తులను 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్వీకరిస్తున్నారు. దరఖాస్తులను పంపించడానికి ఆఖరి తేదీ 2026 జులై 31. అన్ని ఎంట్రీలనూ https://awards.gov.in లో మాత్రమే సమర్పించాల్సివుంటుంది.
భారతీయ పౌరులై ఉండి, ఈ సంవత్సరం జులై 31 నాటికి 5 ఏళ్ల మొదలు 18 ఏళ్ల వయసు లోపున్న బాలబాలికలు ఈ పురస్కారాలకు అర్హులు. బాలలు ఈ పురస్కారాల కోసం తమను తాము కూడా నామినేట్ చేసుకోవచ్చును. అలాగే ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తి (థర్డ్- పార్టీ) సిఫారసులను కూడా స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులు మౌలిక వ్యక్తిగత వివరాలనూ, పురస్కార కేటగిరీనీ పేర్కొని సహాయక డాక్యుమెంట్లతో పాటు ఇటీవలి ఫోటోను కూడా అప్‌లోడ్ చేయాల్సివుంటుంది. అలాగే వారు తాము సాధించిన ఘనతను, అది కలిగించిన ప్రభావాన్ని వివరిస్తూ ఒక కథనాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది.  

పీఎమ్‌ఆర్‌బీపీ అవార్డును ఆరు రంగాల్లో అసాధారణ విజయాలను సాధించిన బాలబాలికలను గౌరవించడానికి ఏర్పాటు చేశారు. నామినేషన్‌ కోసం ఉద్దేశించిన కేటగిరీలు ఈ కింది విధంగా ఉన్నాయి:
      సాహసం: తమ ప్రాణాలకు తెగించి మరీ ఇతరుల ప్రాణాలను కాపాడిన బాలలను గాని, లేదా అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించిన బాలలను గాని ఈ కేటగిరీలో పురస్కార ప్రదానానికి పరిశీలిస్తారు.
      క్రీడలు: జాతీయ స్థాయిలో, లేదా అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు, లేదా పతకాలు పొందిన బాలలను ఈ కేటగిరీలో పరిశీలిస్తారు.
      సామాజిక సేవ: సమాజానికి సంబంధించిన అంశాలను మెరుగుపరచడంలో తోడ్పడే కార్యక్రమాలను మొదలుపెట్టిన, పర్యావరనాన్ని కాపాడుతున్న, అణగారిన వర్గాలకు సాయపడుతున్న, జాతీయ హితాల కోసం అగ్రగామి పాత్రను పోషించడానికి ముందడుగు వేసిన బాలలను ఈ కేటగిరీలో పురస్కార ప్రదానానికి పరిశీలిస్తారు.
      విజ్ఞ‌ానశాస్త్రం, సాంకేతిక విజ్ఞ‌ానం: బాలల పరిశోధన లేదా నూతన, మూలరూపాల (ప్రోటోటైపుల) ఆవిష్కరణలు ఈ కేటగిరీలోకి వస్తాయి.
      పర్యావరణం: దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే పద్ధతులు, చైతన్య ప్రధాన ప్రచార కార్యక్రమాలు, లేదా పర్యావరణానుకూల నూతన ఆవిష్కరణలకు సంబంధించిన కేటగిరీ ఇది.
     •  కళలు, సంస్కృతి: సంగీతం, నృత్యం, రచన, చిత్రలేఖనం, ప్రదర్శన కళలు, లేదా ఇతర కళారూపాల్లో అసాధారణ ప్రతిభను చూపి రాణించిన బాలలను ఈ కేటగిరీలో లెక్కలోకి తీసుకొని పురస్కార ప్రదానానికి పరిశీలిస్తారు.
పైన పేర్కొన్న మాదిరి ప్రతిభావంతులను కనిపెట్టి, వారిని నామినేట్ చేయాల్సిందిగా పాఠశాలలను, సంస్థలను, తల్లితండ్రులను, గురువులను, సామాన్య ప్రజానీకాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ కోరుతోంది. 

రండి.. యోగ్యులైన బాలబాలికలకు వారి ప్రతిభను చాటుకోవడానికి ఒక జాతీయ వేదిక అందుబాటులోకి వచ్చేటట్లు చూద్దాం.

***


(रिलीज़ आईडी: 2270970) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam