పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచంలోనే అతి తక్కువ వంట గ్యాస్ ధరను చెల్లిస్తున్న భారతీయులు


పొరుగు దేశాల కంటే, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌లోనే చవకగా లభిస్తోన్న సిలిండరు

ఉజ్వల కుటుంబాలకు ప్రతి ఏటా మొదటి నాలుగు రీఫిల్ సిలిండర్లకు రూ. 300 చొప్పున రాయితీ – ఏటా లబ్ధిదారునికి రూ.1,200 ప్రయోజనం

పీఎంయూవై పరిధిలోకి రాని వారు కూడా మార్కెట్ కంటే రూ.700 తక్కువే చెల్లిస్తున్నారు

ఫిబ్రవరి నుంచి సౌదీ సీపీ 46 శాతానికి చేరుకోవడంతో ప్రతి సిలిండరుపై రూ.1,600కు పెరిగిన సరఫరా ధర – ప్రతి గృహ వినియోగ సిలిండరుపై వస్తున్న నష్టం రూ.700

హర్మూజ్ జలసంధి నుంచి ఇంధన కార్గోలను తరలిస్తున్న అతి తక్కువ దేశాల్లో భారత్ ఒకటి: పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదు

प्रविष्टि तिथि: 07 JUN 2026 8:02AM by PIB Hyderabad

పొరుగు దేశాలతో పోలిస్తే.. భారతీయ కుటుంబాలు చవక ధరకే వంట గ్యాసును కొనుగోలు చేస్తున్నాయి.  అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలైన అమెరికాఆస్ట్రేలియాకెనడా లాంటి దేశాల్లో చెల్లించే ధర కంటే తక్కువే చెల్లిస్తున్నాయిప్రస్తుతం సరఫరా వ్యయం రూ.1,600కు పెరిగిందిఅయినప్పటికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవైలబ్ధిదారు 14.2 కేజీల సిలిండరుకు రూ. 642 చెల్లిస్తేఢిల్లీలోని సాధారణ వినియోగదారు రూ.942 చెల్లిస్తున్నారు.

మార్కెట్

14.2 కేజీల సిలిండరు ధర (₹)

ఉజ్వల వినియోగదారుడు ఎంత తక్కువ చెల్లిస్తున్నారంటే

ఇండియా (ఉజ్వలసవరణ తర్వాత వర్తించేది)

642

పాకిస్థాన్

1,046

సుమారుగా 39%

నేపాల్

1,207

సుమారుగా 47%

బంగ్లాదేశ్

దాదాపు. 1,225

సుమారుగా 48%

శ్రీలంక

1,241

సుమారుగా 48%

అమెరికా

దాదాపు. 1,755

సుమారుగా 63%

ఆస్ట్రేలియా

దాదాపు. 1,765

సుమారుగా 64%

కెనడా

దాదాపు. 2,411

సుమారుగా 73%

.ప్రతి మార్కెట్లోని ధరతో పోలిస్తే ఉజ్వల సిలిండరుకు చెల్లిస్తున్న ధర రూ.642 ఎంత ప్రభావవంతమైనదో చివరి కాలమ్ సూచిస్తుంది.

మూలంప్రభుత్వ వర్గాలుజాతీయ నియంత్రణ సంస్థలు

అంతర్జాతీయంగా ఉన్న ధరలపై ఆధారపడి భారతీయ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఉంటాయిఅయినప్పటికీ గృహ వినియోగ ఎల్పీజీకి సంబంధించి వినియోగదారుడు చెల్లించాల్సిన ధరను ప్రభుత్వం నియంత్రిస్తూనే ఉంటుందిఏ కుటుంబమైనా తనకు అవసరమైనన్ని సిలిండర్లను ఒక్కొక్కటీ రూ.942కే కొనుగోలు చేయవచ్చుపీఎంయూవై లబ్ధిదారునికి ప్రతి ఏటా మొదటి నాలుగు రీఫిల్ సిలిండర్లకు రూ. 300 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అదనపు ప్రయోజనం లభిస్తుందిఉజ్వల గృహానికి సంబంధించి సగటు వార్షిక వినియోగం నాలుగు రీఫిల్ సిలిండర్లువాస్తవానికి లబ్ధిదారులు ఈ సిలిండర్లకు రూ. 642 చెల్లిస్తారుఈ ప్రయోజనంలో ఎలాంటి మార్పూ లేదుపీఎంయూవై పరిధిలోకి రాని వినియోగదారులు సైతం సిలిండరుకు మార్కెట్ ధర కంటే రూ.700 తక్కువే చెల్లిస్తున్నారుపంపిణీ ఖర్చుల వల్ల వివిధ ప్రాంతాల్లో రీటైల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది.

సాధారణ వినియోగదారుల చెల్లించని అనేక వందల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తోందిఅంతర్జాతీయంగా ధరలు అమాంతం పెరిగిన సందర్భంలోనూ వినియోగదారుడిపై భారం పడకుండా ప్రభుత్వం తనపై వేసుకుంది.

వినియోగ నియంత్రణ

హోటళ్లువ్యాపార సంస్థలు ఉపయోగించే వాణిజ్య సిలిండరు ధర ప్రతినెలా మారుతుందిఎందుకంటే దాని ధర అంతర్జాతీయ ప్రామాణిక ధరపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుందిగృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర అలా ఉండదుభారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటోందిఈ దిగుమతుల ధర ప్రతి నెల ప్రారంభంలో సౌదీ ఆరామ్కో నిర్ణయించే సౌదీ కాంట్రాక్టు ధర (సీపీ)పై ఆధారపడి ఉంటుందిఇది బాహ్యధరదీనిపై భారతీయ వినియోగదారుని ఎలాంటి నియంత్రణ ఉండదు.

పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ప్రామాణిక ధర అమాంతం పెరిగిందిభారత్‌లో ఎల్పీజీ కోసం ఉపయోగించే 50:50 ప్రొపేన్-బ్యూటేన్ మిశ్రమం విషయానికి వస్తే.. సంక్షోభానికి ముందు ఫిబ్రవరిలో ఎల్పీజీకి సౌదీ సీపీ ధర టన్నుకు 543 అమెరికన్ డాలర్లుగా ఉండేదిఫిబ్రవరి చివరిలో హర్మూజ్ జలసంధిని మూసివేసిన అనంతరంసంక్షోభం కారణంగా మధ్య ప్రాచ్య గల్ఫ్ ఎగుమతులను తగ్గించిన తర్వాత,  ఏప్రిల్ మొదటిసారి నిర్దేశించిన కాంట్రాక్టు ధర టన్నుకు 775 అమెరికన్ డాలర్లకు పెరిగిందిప్రొపేన్ 750 అమెరికన్ డాలర్లుబ్యూటేన్ 800 అమెరికన్ డాలర్లుగా ఉన్నాయిఆ తర్వాత జూన్లో ధర మరింత పెరిగి టన్ను 790 అమెరికన్ డాలర్లకు చేరుకుందిసంక్షోభానికి ముందు ఫిబ్రవరి నాటి ధరలతో పోలిస్తే.. ప్రామాణిక ధర 46 శాతం పెరిగిందిమాలిక్యూల్ దిగుమతుల ధరలు సైతం పెరిగాయి.

 

కాలం, 2026

ప్రొపేన్ సీపీ (టన్నుకు అమెరికన్ డాలర్లు)

బ్యుటేన్ సీపీ (టన్నుకు అమెరికన్ డాలర్లు)

ఎల్పీజీకి సౌదీ సీపీ 50:50 మిశ్రమం (టన్నుకు అమెరికన్ డాలర్లు)

ఫిబ్రవరి (సంక్షోభానికి ముందు)

545

540

542.50

ఏప్రిల్ (హర్మూజ్ మూసివేత తర్వాత)

750

800

775.00

జూన్ (తాజాగా)

760

820

790.00

ఫిబ్రవరి నుంచి జూన్ ‌కు పెరుగుదల

+215 (+39%)

+280 (+52%)

+247.50 (సుమారు +46%)

 

వినియోగదారునిపై పడని భారం

జూన్ కాంట్రాక్టు ధర అనంతరం దిగుమతి ఆధారిత ధరల ప్రకారం 14.2 కేజీల సిలిండరు వ్యయం రూ.1,600 దాటిందిప్రస్తుతం ప్రతి గృహ వినియోగ సిలిండరుపై రూ.700 నష్టం వస్తోందిధరల పెరుగుదలలో తీవ్రత మార్కెట్ ధర ఆధారిత వాణిజ్య సిలిండరులో స్పష్టంగా కనిపిస్తోందిపశ్చిమాసియా సంక్షోభం సమయంలో అయిదు సార్లు ధరలు పెంచిన అనంతరం ఢిల్లీలోని హోటళ్లురెస్టారెంట్లకు అమ్మే 19 కేజీల సిలిండరు రూ. 3,113.50కు అమ్ముడవుతోందిఅంటే కేజీకి సుమారుగా రూ.164 అవుతోందిసవరణ తర్వాత గృహ వినియోగ గ్యాసుపై వినియోగదారులు కేజీకీ రూ.66 చెల్లిస్తున్నారువాణిజ్య గ్యాసుపై అధిక పన్ను రేటుపెద్ద మార్జిన్లు ఉంటాయికాబట్టి గృహ వినియోగ సిలిండర్ల కంటే ఎక్కువ ధర ఉంటుందిఅయినప్పటికీ గృహావసరాల కోసం వినియోగించే సిలిండరు వాస్తవ ధర రూ. 1,600 దాటుతోంది.

హర్మూజ్ మూసివేత అనంతరం కూడా కొనసాగుతున్న సరఫరా

సంక్షోభం ముదిరిన అనంతరం హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణా చాలా వరకు నిలిచిపోయిందిప్రపంచంలో అయిదో వంతు చమురుభారత ఇంధన దిగుమతుల్లో అధిక భాగం ఈ జలసంధి గుండానే వస్తోందిభారత దేశ ఎల్పీజీ వినియోగంలో 54 శాతం ఈ జలసంధి ద్వారానే రవాణా అయ్యేదిఈ అంతరాయం వల్ల ఎదురైన ప్రత్యక్ష ప్రభావం వంటగ్యాస్ సరఫరాపై పడిందిఈ జలసంధి గుండా ఇంధనాన్ని తెచ్చుకుంటున్న అతి కొన్ని దేశాల్లో భారత్ ఒకటినిరంతర పర్యవేక్షణ ద్వారా భారతీయ జెండాలున్న ట్యాంకర్లు హర్మూజ్ గుండా ప్రయాణించి భారత్ పోర్టులకు చేరుకున్నాయిఇవి ముడి చమురుఎల్పీజీను తీసుకువచ్చాయిపెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదుబాటిలింగ్పంపిణీ దేశవ్యాప్తంగా యధావిధిగా కొనసాగుతున్నాయి.

సంక్షోభ సమయంలో సరఫరాను కొనసాగించడానికి అనేక చర్యలు తీసుకున్నారుసరఫరా విషయానికి వస్తేదిగుమతుల లోటును తగ్గించడానికి దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 32 టీఎంటీల నుంచి 52 టీఎంటీలకు అంటే 60 శాతానికి పైగా పెంచారునిరంతర సమన్వయం ద్వారా ఎల్పీజీతో నిండిన నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాయిఇతర దేశాల కంటే భారతీయ నౌకలే అత్యధిక సంఖ్యలో ప్రయాణించాయిదీనికోసం ఎలాంటి పన్నూ చెల్లించలేదుఅదే సమయంలో జలసంధి ద్వారా ప్రయాణించాల్సిన అవసరం లేని అమెరికాకెనడాఅల్జీరియా తదితర దేశాల నుంచి దిగుమతులను పెంచారుఅందుబాటులో ఉన్న ఎల్పీజీని ప్రాధాన్య వినియోగదారులైన గృహాలకుఆసుపత్రులకువిద్యాసంస్థలకు అందించారు.

డిమాండు విషయానికి వస్తేసిలిండర్ల పంపిణీ ఒత్తిడిని తగ్గించడానికి అందుబాటులో ఉన్న చోట పైప్డ్ నేచురల్ గ్యాసు (పీఎన్జీ)కి మారాల్సిందిగా వినియోగదారులను ప్రోత్సహించారుదేశీయంగా సరఫరాను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలుపారిశ్రామిక సంఘాల సమన్వయంతో కఠినమైన మళ్లింపు నిరోధక చర్యలను అమలు చేశారురాయితీతో అందించే గృహ వినియోగ ఎల్పీజీని వాణిజ్య మార్కెట్లో దుర్వినియోగం చేయకుండా ఓటీపీ ఆధారిత డెలివరీ ధ్రువీకరణను సుమారుగా 90 శాతానికి పెంచారు.

ప్రభుత్వంపై పడుతున్న భారం

రెండు విభిన్న మార్గాల ద్వారా వినియోగదారునికి భద్రత లభిస్తుందిఅంటే రాయితీఅండర్ రికవరీ వేర్వేరు అంశాలుగా ఉంటాయిఅండర్ రికవరీ అంటే మాలిక్యూల్‌కి సంబంధించి అంతర్జాతీయ వ్యయానికినియంత్రిత రీటైల్ ధరకు ఉన్న వ్యత్యాసంఈ నష్టాన్ని ప్రభుత్వ రంగ మార్కెటింగ్ సంస్థలు భరిస్తాయిఈ లోటును ఖజానా నుంచి పాక్షికంగా భర్తీ చేస్తారుగడచిన ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గృహ వినియోగ ఎల్పీజీపై మొత్తం నష్టం రూ. 60,000 కోట్లకు చేరుకుందిఅంతకు ముందు ఏడాది ఇది రూ. 41,338 కోట్లుగా ఉందిదీనికి సంబంధించి రూ. 30,000 కోట్ల పరిహారాన్ని మార్కెటింగ్ సంస్థలకు అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందివినియోగదారులకు అదనంగా సబ్సిడీ లభిస్తుందిఉజ్వల వినియోగదారులకు ప్రతి సిలిండరుపై రూ.300 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందిదాదాపు 10.58 కోట్ల కనెక్షన్లకు ఈ ప్రయోజనం అందుతోందిగత కొన్ని సంవత్సరాలుగా ఈ పద్ధతిలోనే భారతీయ వినియోగదారులందరూ అంతర్జాతీయ మార్కెట్ స్థాయిల కంటే చాలా తక్కువ ధరలకే ఎల్పీజీని పొందుతున్నారుఅంతర్జాతీయ ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం కొన్నేళ్లుగా తన పౌరులకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు వంట గ్యాస్ అందిస్తోంది.

.

కాలవ్యవధి

వ్యవస్థ (గృహావసర వినియోగ ఎల్పీజీ మాత్రమే)

మొత్తం

ఆర్థిక సంవత్సరం 2024–25

గృహ వినియోగ ఎల్పీజీపై మొత్తం నష్టం (అంతకు ముందు ఏడాది)

41,338 కోట్లు

ఆర్థిక సంవత్సరం 2025–26

గృహ వినియోగ ఎల్పీజీపై మొత్తం నష్టం (గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి)

60,000 కోట్లు

ఆర్థిక సంవత్సరం 2025–26

ఎల్పీజీ నష్టాలను పూడ్చుకొనేందుకు మార్కెటింగ్ సంస్థలకు పరిహారం అందించేందుకు క్యాబినెట్ ఆమోదించిన మొత్తం

30,000 కోట్లు

ఒక సిలిండరుకు

ప్రతి 14.2 కేజీల సిలిండరుపై భరిస్తున్న నష్టం

సుమారుగా ₹700

2016 నుంచి

పీఎంయూవై  కనెక్షన్లుప్రత్యక్ష నగదు బదిలీ (సిలిండరకు రూ. 300)

10.58 కోట్ల కనెక్షన్లు

సంక్షిప్తంగా

హర్మూజ్ జలసంధి నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వల్ల గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సరఫరా తగ్గిపోయిందిదీనివల్ల 2026లో ఫిబ్రవరిజూన్ మాసాల మధ్య ఎల్పీజీకి సంబంధించి సౌదీ సీపీ ప్రామాణిక ధర 46 శాతం మేర పెరిగిందిఫలితంగా 14.2 కేజీల సిలిండర్ పంపిణీ ధర రూ. 1,600 దాటిందిసాధారణ వినియోగదారునికి రూ. 942కుఉజ్వల వినియోగదారునికి రూ. 642కు రీటైల్ ధరను సవరించారుఅంతర్జాతీయ ధరకునియంత్రిత పంపిణీ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసమే అండర్రికవరీఇది రాయితీకి భిన్నంగా ఉంటుందిగృహ వినియోగ ఎల్పీజీకి సంబంధించి గతేడాది నష్టాలు రూ. 60,000 కోట్లకు చేరుకున్నాయని అంచనాఅంతకు ముందు సంవత్సరం అది రూ. 41,338 కోట్లుగా ఉందిఈ భారాన్ని ప్రభుత్వ రంగ మార్కెటింగ్ సంస్థలుఖజానా భరిస్తున్నాయిదీనికి సంబంధించి రూ. 30,000 కోట్ల పరిహారాన్ని అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందిదీనికి అదనంగా 10.58 కోట్ల మంది ఉజ్వల పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండరుకు రూ.300 చొప్పున అదనంగా జమవుతుందిగత కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారులంతా అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే తక్కువకే ఎల్పీజీని పొందుతున్నారుపొరుగుదేశాలైన పాకిస్థాన్నేపాల్బంగ్లాదేశ్శ్రీలంక కంటే భారతీయ గృహాలు తక్కువ ధరను చెల్లిస్తున్నాయిఅమెరికాఆస్ట్రేలియాకెనడా కంటే కూడా తక్కువే చెల్లిస్తున్నాయిసంక్షోభ సమయంలో హర్మూజ్ జలసంధి గుండా ఇంధన కార్గోలను రవాణా చేసిన అతి తక్కువ దేశాల్లో భారత్ ఉందిదేశంలో ఏ పెట్రోలియం ఉత్పత్తికీ కొరత లేదుఅంతర్జాతీయ ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా తన పౌరులకు అతి తక్కువ ధరలకే వంట గ్యాసును భారత ప్రభుత్వం అందిస్తోంది.

ఉజ్వల పథకం పరిధిలో మొదటి నాలుగు సిలిండర్లు రూ.642కే లభిస్తాయిఅంటే వాస్తవ ధరల కంటే ఒక సిలిండరుకు వచ్చే రాయితీ సుమారుగా 60 శాతంగా ఉంటుందిపీఎంయూవై పరిధిలోకి రాని వారికి అంతర్జాతీయ ధరలపై సుమారుగా 45 శాతం రాయితీతో రూ. 942కే సిలిండరు లభిస్తోంది.

ఈ విలువైన వనరును ఉపయోగించుకోవడంలో అత్యంత జాగ్రత్త వహించాలనిఇంధనాన్ని ఆదా చేసే వంట పద్ధతులను అవలంబించాలని కోరుతున్నాం.

 

***


(रिलीज़ आईडी: 2270186) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali-TR , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam