ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అండర్‌ 18 ఆసియా కప్ 2026లో కాంస్యం గెలిచిన భారత మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 06 JUN 2026 6:16PM by PIB Hyderabad

అండర్-18  ఆసియా కప్‌ 2026లో కాంస్య పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్‌ పొడవునా భారత క్రీడాకారిణులు అసాధారణమైన పట్టుదలను, ప్రతిభను కనబరిచారని ప్రధానమంత్రి కొనియాడారు.

 

దేశంలో మహిళల హాకీకి పెరుగుతున్న బలాన్ని, మన క్రీడాకారిణుల్లో ఉన్న అపారమైన సామర్థ్యానికి ఈ ఘనతే నిదర్శనమని శ్రీ మోదీ తెలిపారు. ఈ సందర్భంగా భారత జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు..

 

‘‘అండర్-18 ఆసియా కప్ 2026లో కాంస్య పతకం గెలిచిన భారత మహిళల హాకీ జట్టుకు అభినందనలు. ఈ టోర్నమెంట్‌ అంతటా మన జట్టు అద్భుతమైన పట్టుదలను ప్రదర్శించింది. ఈ ఘనత భారతదేశంలో మహిళల హాకీ ఎదుగుతున్న బలాన్ని, మన క్రీడాకారిణుల అపారమైన ప్రతిభను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తులో వారు చేపట్టబోయే ప్రతి ప్రయత్నానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’.

****


(रिलीज़ आईडी: 2269913) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , Kannada , Assamese , English , Urdu , हिन्दी , Manipuri , Gujarati , Malayalam