ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభం కానున్న తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్


ప్రపంచవ్యాప్తంగా యోగాకున్న ప్రజాదరణ వివరించిన ప్రధాని

प्रविष्टि तिथि: 03 JUN 2026 10:31PM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా యోగా అపారమైన ప్రజాదరణ పొందుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పేర్కొన్నారురేపు అంటే జూన్ 4న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్ 2026 ప్రారంభం కానున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా ఔత్సాహికులను ఒకచోట చేరుస్తోందనియోగాసనానికి సంబంధించిన ప్రపంచ క్రీడా ప్రణాళికలో ఇది ముఖ్యమైన విజయమని ప్రధానమంత్రి తెలియజేశారురేపు సాయంత్రం సుమారు 6:40 గంటలకు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటానని శ్రీ మోదీ ప్రకటించారుఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారుఈ పోటీల్లో పాల్గొనే వారందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘ప్రపంచవ్యాప్తంగా యోగాకు అత్యంత ప్రజాదరణ లభిస్తోందిరేపుజూన్ 4న అహ్మదాబాద్‌లో చాలా ప్రత్యేకమైన పోటీ జరగనుందిఅదే ప్రపంచ యోగాసన క్రీడల ఛాంపియన్‌షిప్ - 2026. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా ఔత్సాహికులను ఈ వేదిక ఒక్కచోటకు చేరుస్తోందియోగాసనాలకు సంబంధించి అంతర్జాతీయ క్రీడా ప్రణాళికలో ఇది ఓ ముఖ్యమైన విజయంరేపు సాయంత్రం 6:40 ప్రాంతంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటానుఈ వినూత్న కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు.’’

 

***


(रिलीज़ आईडी: 2268882) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam