ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారుల విస్తరణ పనులకు కేబినెట్ ఆమోదం
మధ్యప్రదేశ్‌లోని ఎన్‌హెచ్-347Bకి చెందిన హివార్‌ఖేడి - రోష్ని - ఆశాపుర్ - రూధి సెక్షన్‌లో (125.01 కిలోమీటర్ల) ప్రస్తుత ఇంటర్మీడియట్ లేన్‌ను పేవ్డ్ షోల్డర్ ప్రమాణాలతో 2 వరుసలుగా విస్తరించేందుకు కేబినెట్ ఆమోదం
దేశ్‌గావ్-జుల్వానియా సెక్షన్‌లో (108.643 కిలోమీటర్ల) ప్రస్తుత 2 వరుసల రహదారిని 4 వరుసలుగా విస్తరించడానికి ఆమోదం తెలిపిన కేబినెట్
మొత్తం పొడవు 233.653 కిలోమీటర్లు... వ్యయం రూ. 4,415.60 కోట్లు
प्रविष्टि तिथि:
03 JUN 2026 3:29PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్‌హెచ్-347Bలో భాగమైన హివార్‌ఖేడి - రోష్ని - ఆశాపుర్ - రూధి సెక్షన్‌లో (125.01 కిలోమీటర్ల) ప్రస్తుత ఇంటర్మీడియట్ లేన్‌ను పేవ్డ్ షోల్డర్ ప్రమాణాలతో 2 వరుసలుగా... దేశ్‌గావ్-జుల్వానియా సెక్షన్‌లో (108.643 కిలోమీర్ల) ప్రస్తుత 2 వరుసల రహదారిని 4 వరుసలుగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో మొత్తం రూ.4,415.60 కోట్ల వ్యయంతో విస్తరించడానికి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని ఎన్‌హెచ్-347Bలో భాగమైన హివార్‌ఖేడి-రోష్ని-ఆశాపూర్-రూధి, దేశ్‌గావ్-జుల్వానియా సెక్షన్‌లను విస్తరించే ఈ ప్రాజెక్టు... బేతుల్, ఖండ్వా, ఖర్‌గోన్, బర్వానీ జిల్లాల్లోని అధిక జనసాంద్రత గల ప్రాంతాల్లోని తీవ్రమైన నిర్మాణాకృతి సంబంధిత లోపాలు, నిటారైన మలుపులు, రద్దీ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఖర్‌గోన్ జిల్లాలో 16.20 కిలోమీటర్ల పొడవు గల విస్తరించిన గ్రీన్‌ఫీల్డ్ బైపాస్‌నూ అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సగటు ప్రయాణ వేగాన్ని పెంచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం సహా... మొత్తం రహదారి భద్రత, ఇంధన సామర్థ్యం, వాహన నిర్వహణ ఖర్చులనూ మెరుగుపరుస్తుంది. తద్వారా ప్రాంతీయ రవాణా, సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తుంది.
ఈ ప్రాజెక్టు మధ్యప్రదేశ్‌లోని కీలక ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ కేంద్రాలకు నిరాటంకమైన అనుసంధానాన్ని అందిస్తుంది. ఈ విస్తరించిన కారిడార్... 06 పీఎం గతి-శక్తి ఆర్థిక కేంద్రాలు (01 టెక్స్‌టైల్ క్లస్టర్, 02 మెగా ఫుడ్ పార్కులు, 01 ఇండస్ట్రియల్ పార్క్, 02 సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లు), 5 సామాజిక కేంద్రాలు (02 ఆకాంక్షాత్మక జిల్లాలు- ఖండ్వా, బర్వానీ, 03 గిరిజన జిల్లాలు- బేతుల్, ఖండ్వా, ఖర్‌గోన్), 5 లాజిస్టిక్ కేంద్రాలను (02 ప్రధాన రైల్వే స్టేషన్లు, 02 విమానాశ్రయాలు, 01 ఎంఎంఎల్పీ) అనుసంధానించడం ద్వారా బహుళ-రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ఈ ప్రాంతం అంతటా సరుకుల రవాణా, ప్రయాణికుల ప్రయాణానికీ ఇది దోహదపడుతుంది.
కారిడార్ మ్యాప్

అనుబంధం – I: ప్రాజెక్టు వివరాలు
|
ఫీచర్
|
వివరాలు
|
|
ప్రాజెక్టు పేరు
|
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్‌హెచ్-347Bలో భాగమైన హివార్‌ఖేడి - రోష్ని - ఆశాపుర్ - రూధి సెక్షన్‌లో (125.01 కిలోమీటర్లు) ఉన్న ఇంటర్మీడియట్ లేన్‌ను పేవ్డ్ షోల్డర్ ప్రమాణాలతో 2 వరుసలుగా... దేశ్‌గావ్-జుల్వానియా సెక్షన్‌లో (108.643 కిలోమీటర్లు) ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసలుగా (మొత్తం పొడవు-233.653 కిలోమీటర్లు) హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో విస్తరించే పనులు చేపట్టడం.
|
|
కారిడార్
|
బేతుల్-ఖండ్వా-వడోదర
|
|
పొడవు (కిలోమీటర్లు)
|
233.653
|
|
మొత్తం నిర్మాణ వ్యయం (రూ. కోట్లలో)
|
2705.08
|
|
భూ సమీకరణ వ్యయం (రూ. కోట్లలో)
|
432.77
|
|
మొత్తం మూలధన వ్యయం (రూ. కోట్లలో)
|
4415.60
|
|
విధానం
|
హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎమ్)
|
|
బైపాస్‌లు
|
హివార్ఖేడి-రోష్ని-ఆశాపూర్-రూధి విభాగం
బైపాస్ పొడవు=70.39 కిలోమీటర్లు
|
దేశ్‌గావ్-జుల్వానియా సెక్షన్
బైపాస్ పొడవు = 54.273 కిలోమీటర్లు
|
|
అనుసంధానమయ్యే ప్రధాన రహదారులు
|
జాతీయ రహదారులు – ఎన్‌హెచ్-47, ఎన్‌హెచ్-753, ఎన్‌హెచ్-347BG, ఎన్‌హెచ్-52
రాష్ట్ర రహదారులు – ఎస్‌హెచ్ -15, ఎమ్‌డీఆర్
|
|
అనుసంధానమయ్యే ఆర్థిక / సామాజిక / రవాణా కేంద్రాలు
|
విమానాశ్రయం: ఇండోర్ & నాగ్‌పూర్
రైల్వే స్టేషన్లు: బేతుల్, ఖండ్వా
మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎమ్ఎమ్ఎల్‌పీ): ఇండోర్
ఆర్థిక కేంద్రాలు: 01 టెక్స్‌టైల్ క్లస్టర్, 02 మెగా ఫుడ్ పార్క్, 01 ఇండస్ట్రియల్ పార్క్, 02 సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లు
|
|
అనుసంధానమయ్యే నగరాలు / పట్టణాలు
|
బేతుల్, ఖండ్వా, ఖర్గోనే, బర్వానీ
|
|
ఉపాధి కల్పన సామర్థ్యం
|
19.50 లక్షల పనిదినాలు (ప్రత్యక్ష), 23.00 లక్షల పనిదినాలు (పరోక్ష)
|
***
(रिलीज़ आईडी: 2268436)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam