వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచ అగ్రశ్రేణి పారిశ్రామిక ప్రముఖులతో న్యూయార్క్‌లో ఉన్నత స్థాయి వ్యాపార, పెట్టుబడి సమావేశాలు నిర్వహించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
భారత్ - అమెరికా వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం, వర్ధమాన రంగాల్లో సహకార విస్తరణపై ప్రధానంగా దృష్టి సరించిన చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
29 MAY 2026 3:33PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ న్యూయార్క్ నగర పర్యటనలో భాగంగా 2026 మే 28న అక్కడ పలు ఉన్నత స్థాయి వ్యాపార, పెట్టుబడి సమావేశాల్లో పాల్గొన్నారు.
కార్లైల్ గ్రూప్ సీఈవో శ్రీ హార్వే స్క్వార్ట్జ్, మోర్గాన్ స్టాన్లీ ఛైర్మన్, సీఈవో శ్రీ టెడ్ పిక్, వార్‌బర్గ్ పింకస్ ఛైర్మన్ శ్రీ చార్లెస్ కే, ఆమ్నియల్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీ చింటు పటేల్, మాస్టర్‌కార్డ్ సీఈవో శ్రీ మైఖేల్ మీబాచ్‌తో ఒక్కొక్కరిగా ఈ పర్యటన సందర్భంగా మంత్రి సమావేశమయ్యారు.
భారత్ - అమెరికా వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడం, ప్రపంచ వ్యాపార సంస్థలకు భారత్‌లో అవకాశాలను విస్తరించడం, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడం, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, డిజిటల్ చెల్లింపులు, తయారీ, ఆవిష్కరణ, కృత్రిమ మేధ, వర్ధమాన సాంకేతికతల వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌కు పెరుగుతున్న ఆదరణ కూడా ఈ చర్చల ద్వారా స్పష్టమైంది.
అమెరికా - ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సహకారంతో నిర్వహించిన ఒక వ్యాపార సమావేశంలో.. పెట్టుబడి, వాణిజ్య వర్గాలకు చెందిన 50 మందికి పైగా ప్రముఖ వ్యాపారాధినేతలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. భారత బలమైన వృద్ధి ప్రయాణం, ప్రస్తుత ఆర్థిక సంస్కరణలు, వ్యాపార సౌలభ్యం, సహకారానికి అవకాశమున్న రంగాలు, కీలక రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ సమావేశం అవకాశాన్నిచ్చింది.
భారత ఆర్థిక ధోరణిపై పెరుగుతున్న అంతర్జాతీయ విశ్వాసాన్ని ఈ సమావేశాలు చాటాయి. భారత్, అమెరికా మధ్య బలమైన పారిశ్రామిక సహకారం ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించాయి.
***
(రిలీజ్ ఐడి: 2266834)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8