ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 8:01PM by PIB Hyderabad

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి, పార్లమెంటు సభ్యురాలు పెన్నీ వాంగ్‌తో సమావేశమవ్వడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, వస్తు సరఫరా వ్యవస్థ పటిష్టతను నిర్ధారించడం వంటి రంగాల్లో బలపడుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.

స్వేచ్ఛాయుత, పారదర్శక, సురక్షిత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ కోసం భారత్‌, ఆస్ట్రేలియా ఎప్పటికీ కలిసి పనిచేస్తూనే ఉంటాయని ఇరు దేశాల నేతలు స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి, పార్లమెంటు సభ్యురాలు పెన్నీ వాంగ్‌ను కలవడం సంతోషంగా ఉంది. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, వస్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడటం వంటి రంగాల్లో విస్తరిస్తున్న భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మేం చర్చించాం. స్వేచ్ఛాయుత, పారదర్శక, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ కోసం భారత్, ఆస్ట్రేలియా కలిసి పనిచేస్తూనే ఉంటాయి’’.

 

***


(రిలీజ్ ఐడి: 2265633) సందర్శకుల సూచీ సంఖ్య : : 88