గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దేశాధినేతలకు దౌత్యపరమైన బహుమతుల ద్వారా భారత గిరిజన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 11:18AM by PIB Hyderabad
వైవిధ్యభరితమైన దేశీయ కళా సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపుదిద్దిన బహుమతులను దౌత్య చర్చల సందర్భంగా పలు దేశాధినేతలకు అందించడం ద్వారా... సుసంపన్నమైన భారత వారసత్వ, సంప్రదాయ హస్తకళా వైభవాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటారు.
ఉత్తేజకరమైన భారత గిరిజన కళా పరంపరకు చిహ్నంగా నిలిచే మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక సాంప్రదాయక గోండు చిత్రపటాన్ని స్వీడన్ యువరాణి విక్టోరియాకు బహూకరించారు. చుక్కలూ - రేఖాకృతులతో, ప్రకాశవంతమైన సహజ రంగులూ - ప్రకృతి ప్రేరిత ఇతివృత్తాల చిత్రణతో గోండు సృజనకారులు తీర్చిదిద్దిన ఈ కళాఖండం అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. మధ్యభారతంలో గిరిజన కళాకారులకు గోండు కళ సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందిస్తోంది.

అస్సాం సాంప్రదాయక ‘ముగా’ పట్టు దుపట్టాతోపాటు మణిపూర్‌లోని తంగ్‌ఖుల్ నాగా కళాకారులు అత్యంత నైపుణ్యంతో రూపొందించిన శిరుయ్ లిల్లీ స్టోల్‌ను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనికి బహూకరించారు. ప్రత్యేకమైన సహజ సిద్ధమైన బంగారు జిలుగులు, మన్నికకు ముగా పట్టు పేరుగాంచింది. శతాబ్దాల నాటి అస్సాం చేనేత సంప్రదాయానికి అది ప్రతీక. భౌగోళిక గుర్తింపును కూడా పొందింది. ఇక శిరుయ్ లిల్లీ స్టోల్.. తంగ్‌ఖుల్ నాగా గిరిజనుల సాంస్కృతిక అస్తిత్వాన్ని, కళా సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. మణిపూర్‌కు చెందిన అరుదైన రాష్ట్ర పుష్పం శిరుయ్ లిల్లీ దీనికి ప్రేరణ.

మణిపూర్ నల్ల బియ్యాన్ని (చాక్-హావ్) గౌరవ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజమాతకు బహూకరించారు. ఆ ప్రాంతంలోని కొండజాతి గిరిజన సామాజిక వర్గాలు తరతరాలుగా సంప్రదాయబద్ధంగా పండిస్తున్న విశేషమైన ధాన్యమిది. అద్భుతమైన పౌష్టిక, ఔషధ విలువలతో అంతర్జాతీయ గుర్తింపును పొందిన ఈ చాక్-హావ్ బియ్యం.. అక్కడి దేశీయ తెగలు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సుసంపన్నమైన వ్యవసాయ సంప్రదాయాలకు నిదర్శనం.

దేశ గిరిజన సంప్రదాయాలను, దేశీయ హస్తకళలను, సాంస్కృతిక వారసత్వాన్ని ఈ దౌత్య కార్యక్రమాల ద్వారా గౌరవ ప్రధానమంత్రి అంతర్జాతీయ వేదికపై ఘనంగా చాటారు. దేశ కళా, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడడంలో గిరిజన సమాజం అందిస్తున్న అమూల్యమైన సేవలకు లభించిన సముచితమైన గుర్తింపు, గౌరవమిది.
***
(రిలీజ్ ఐడి: 2265445)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam