ప్రధాన మంత్రి కార్యాలయం
నెదర్లాండ్స్ పీఎం రాబ్ జెట్టెన్‌తో ప్రతినిధుల స్థాయి సమావేశం సందర్భంగా పీఎం ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
16 MAY 2026 11:58PM by PIB Hyderabad
గౌరవనీయులారా,
నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత నెదర్లాండ్స్‌ను సందర్శించటం నాకెంతో సంతోషంగా ఉంది. గత పదేళ్లలో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యం గణనీయంగా పురోగతిని సాధించింది.
గౌరవనీయులారా,
భారత్‌కు అత్యంత కీలక భాగస్వామ్య దేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి అని మేం భావిస్తున్నాం. భారతదేశంలో పెట్టుబడులు పెట్టే తొలి అయిదు దేశాల్లో నెదర్లాండ్స్ ఉంది. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య బలమైన సంబంధాలున్నాయి. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, కర్తవ్య నిర్వహణ ఇరుదేశాల ఉమ్మడి దృక్పథంలో భాగాలు. నీరు, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో పరస్పర సహకారం ప్రజల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తోంది. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఈ భాగస్వామ్యం దృష్ట్యా 2023లో భారత్ జీ-20 అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు నెదర్లాండ్స్‌ను అతిథి దేశంగా ఆహ్వానించాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో నెదర్లాండ్స్ మాజీ ప్రధానమంత్రి పాల్గొనటం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
గౌరవనీయులారా,
ప్రపంచంలో అత్యంత యువ జనభా గల దేశం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గల దేశం భారత్. నెదర్లాండ్స్, ఐరోపాలో నూతన తరం నాయకత్వానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్ని రంగాల్లో నెదర్లాండ్స్ నైపుణ్యాన్ని, భారత్ వేగాన్ని, విస్తృతిని మనం అనుసంధానించాలి. ఆవిష్కరణలు, పెట్టుబడులు, సుస్థిరత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని నూతన శిఖరాలకు చేర్చాలి. ఈ ఉమ్మడి దార్శనికతతో నేడు భారత్-నెదర్లాండ్స్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తున్నాం. మీరు అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
***
(రిలీజ్ ఐడి: 2262673)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam