హోం మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
వడగాలుల వల్ల ఒక్క మరణం కూడా సంభవించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం
గత 20 ఏళ్లుగా ధైర్యం, అంకితభావం, కృషితో దేశ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, ప్రెసిడెంట్స్ కలర్ గౌరవాన్ని పొందిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి అభినందనలు
7 కోట్లకు పైగా మొక్కలను నాటిన సీఏపీఎఫ్ సిబ్బంది... పర్యావరణ పరిరక్షణలో, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవటంలో వీటి పాత్ర కీలకం
విపత్తు నిర్వహణలో గ్లోబల్ లీడర్‌గా, మొదటి ప్రతిస్పందనదారుగా అవతరించిన భారత్... కార్యాచరణలోకి 'వసుధైవ కుటుంబకం' స్ఫూర్తి
గతంలో ఉపశమనం అందించేలా విపత్తు నిర్వహణ విధానం... ప్రతిస్పందించే స్థాయి నుంచి నివారణ, సమర్థవంతమైన స్థాయికి మార్చిన మోదీ ప్రభుత్వం
విపత్తు నిర్వహణలో 'కనీస ప్రాణ నష్టం' నుంచి '.ఒక్క ప్రాణం కూడా పోకూడదనే' లక్ష్యం దిశగా మోదీ ప్రభుత్వ చర్యలు
విపత్తు ముప్పు నిర్వహణ రంగానికి నూతన దిశనిర్దేశం చేసిన ప్రధానమంత్రి ప్రతిపాదించిన 10 అంశాల అజెండా, 360 డిగ్రీల విధానం
అత్యంత భద్రత భావం, నమ్మకాలతో స్ఫూర్తి కలిగించేలా... 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలను కాపాడి, 9 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
నాడు పోస్టు చేయడమైనది:
14 MAY 2026 1:40PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్) ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, ఎన్డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ... ఎన్డీఆర్‌ఎఫ్‌కు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు బహుకరణ కేవలం వారి ప్రశంసనీయమైన సేవలకు గుర్తింపు మాత్రమే కాదని, ఎస్డీఆర్‌ఎఫ్‌లు, పంచాయతీల నుంచి రాష్ట్రాల వరకున్న మొత్తం వ్యవస్థ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సేవలో నిమగ్నమైన వేలాది మంది విపత్తు స్వచ్ఛంద సేవకుల కృషికి గౌరవ రాష్ట్రపతి ఇచ్చిన గుర్తింపు అని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది “ఆపద సేవా సదైవ సర్వత్ర” నినాదంతో దేశంలో ఎక్కడికైనా వెళ్లి సేవలందిస్తారని కొనియాడారు. భారతదేశంలో, విదేశాల్లోనూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజల ప్రేమను, నమ్మకాన్ని సంపాదించుకున్నారని శ్రీ అమిత్ షా అన్నారు. దేశంలో ఎక్కడ విపత్తు సంభవించినా, సంభవిస్తుందని భావించినా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాగానే సహాయక చర్యలు విజయవంతమవుతాయనే నమ్మకం ఇప్పుడు ప్రజల్లో కలుగుతోందని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటైనప్పటి నుంచి గత 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా వరదలు, భూకంపాలు, తుఫాన్లు, ఇతర విపత్తుల సమయంలో విజయవంతమైన ఆపరేషన్ల ద్వారా 140 కోట్ల మంది పౌరుల నమ్మకాన్ని గెలుచుకుందని శ్రీ అమిత్ షా వెల్లడించారు. ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా ప్రజల ప్రాణాలను కాపాడి, 9 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని భద్రతా భావాన్ని, నమ్మకాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు.
ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానం మొత్తం ఎన్డీఆర్ఎఫ్ సేవ, ధైర్యం, పరాక్రమం, అంకితభావానికి దక్కిన గుర్తింపని కేంద్ర హోం మంత్రి అన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), ఎన్డీఆర్ఎఫ్ విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెట్టాయని, ఇది పౌరులందరికీ గర్వకారణమని, దేశ హోం మంత్రిగా ఆయనకు ప్రత్యేక గౌరవమని తెలిపారు.
2014 నుంచి భారత్ కేవలం విపత్తు ముప్పు తగ్గించేందుకు మాత్రమే కాక, అసలు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునే స్థాయికి చేరుకుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. వాతావరణ శాఖ ముందస్తు సమాచారం అందించిన ప్రతిచోటా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించటమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఎన్‌డీఎంఏ ఎన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకుందని, మార్గదర్శకాలను జారీ చేసిందని, విపత్తు సన్నద్ధతను క్రమంగా జాతీయ సంస్కృతిగా మారుస్తూ ప్రజల్లో అవగాహనను పెంచిందని తెలిపారు. 8,500 మందికి పైగా సిబ్బందికి, 10,000 మందికి పైగా సివిల్ డిఫెన్స్ కార్మికులకు, 2.20 లక్షల మందికి పైగా వాలంటీర్లకు శిక్షణనిచ్చే బృహత్తర కార్యాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ చేపట్టిందని వివరించారు. గత రెండేళ్లలో 10,500 మందికి పైగా పడవలు నడిపే వారికి కూడా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. 12 ఏళ్లలో విపత్తు సన్నద్ధత కేవలం ఒక వ్యవస్థ స్థాయి నుంచి ఒక సంపూర్ణ వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. గ్రామ పంచాయతీల నుంచి భారత ప్రభుత్వం వరకు, ఐఎండీ శాస్త్రవేత్తల నుంచి సామాన్య పౌరుల వరకు అందరూ ఒకే లక్ష్యం కోసం సమన్వయంతో పనిచేసే కొత్త సంస్కృతి ఆవిర్భవించిందని వెల్లడించారు. 16 బెటాలియన్లతో ఎన్డీఆర్‌ఎఫ్ శక్తిమంతమైన దళంగా ఎదిగిందని అన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌లకు శిక్షణ ఇవ్వటం, ఉమ్మడి ఆపరేషన్ల ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్ బలాన్ని పెంపొందించుకుందని తెలిపారు. ముందస్తు మోహరింపు వంటి చర్యలు నష్టాన్ని తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేశాయని చెప్పారు. 2008లో బీహార్‌లో సంభవించిన కోసి వరదలు ఎన్డీఆర్‌ఎఫ్‌కు ఒక పెద్ద పరీక్షగా నిలిచాయని గుర్తుచేశారు. ఆ తర్వాత ధారాలిలో ఆకస్మిక వరదలు, చసోటిలో మేఘ విస్ఫోటనం, జమ్మూ, పంజాబ్, ఢిల్లీ వరదలు, మోంథా, దిత్వ వంటి తుపాను విపత్తులను ఎన్డీఆర్‌ఎఫ్ విజయవంతంగా ఎదుర్కొందని కొనియాడారు. అమర్‌నాథ్ యాత్ర, మహాకుంభ్, చార్‌ధామ్ యాత్ర, మణి మహేశ్ యాత్ర, శబరిమల యాత్ర, జగన్నాథ రథయాత్ర వంటి భారీ కార్యక్రమాల సమయంలోనూ సమాజంతో కలిసి ఎన్డీఆర్‌ఎఫ్ సమర్థవంతంగా పనిచేసిందని శ్రీ అమిత్ షా ప్రశంసించారు. 10 అంశాల అజెండా, 360-డిగ్రీల విధానం విపత్తు ముప్పు నిర్వహణకు నూతన దిశానిర్దేశం చేశాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఇది రిస్క్ మ్యాపింగ్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సామాజిక భాగస్వామ్యం, మార్గదర్శకాల రూపకల్పన వంటి రంగాలను బలోపేతం చేసిందని చెప్పారు. అంతర్జాతీయంగా విపత్తు నిర్వహణలో భారతదేశం తిరుగులేని నాయకుడిగా, తొలి ప్రతిస్పందనదారుగా ఎదిగిందని శ్రీ అమిత్ షా అన్నారు. 'వసుధైవ కుటుంబకం' సూత్రాన్ని ఆచరణలోకి తెచ్చి క్షేత్రస్థాయిలో అమలు చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తితో, విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాల రంగంలో భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. నేడు 48 దేశాలు 'కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' (సీడీఆర్‌ఐ)లో చేరి భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. (సీఏపీఎఫ్‌లు) శ్రీ అమిత్ షా అభినందించారు. 2021 నుంచి సీఏపీఎఫ్ సిబ్బంది దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా మొక్కలను నాటారని చెప్పారు. సీఏపీఎఫ్ దళాల్లోని మానవీయ దృక్పథాన్ని, పర్యావరణ స్పృహను ఇది ప్రతిబింబిస్తుందని కొనియాడారు.
***
(రిలీజ్ ఐడి: 2261233)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam