MIFF banner

19వ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఐఎఫ్‌ఎఫ్‌) ప్రతినిధుల నమోదు ప్రారంభం


జూన్‌ 15 నుంచి 21, 2026 వరకు జరగనున్నదక్షిణాసియాలోనే పురాతనమైన వేడుక.. డాక్యుమెంటరీ, కల్పిత లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాల ఉత్సవమే ఎంఐఎఫ్‌ఎఫ్‌

మహారాష్ట్రలోని ముంబయి పెడ్డర్‌ రోడ్డులో ఉన్న ఎన్‌ఎఫ్‌డీసీ ప్రాంగణంలో జూన్‌ 15 నుంచి 21, 2026 వరకు 19వ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రతినిధుల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎంఐఎఫ్‌ఎఫ్‌ ప్రకటించింది. లఘు చిత్రాల విభాగంలో దక్షిణాసియాలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎంఐఎఫ్‌ఎఫ్‌… ప్రపంచవ్యాప్తంగా సినీ రూపకర్తలు, కళాకారులు, మీడియా నిపుణులు, సినిమా ప్రేమికులను ఒకచోట చేర్చుతుంది.

 

కంటెంట్‌ క్రియేషన్‌లో ప్రపంచ అగ్రగామిగా భారత చలన చిత్ర పరిశ్రమ ఎదుగుతున్న తరుణంలో ఔత్సాహిక సినీ రూపకర్తలకు ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కీలక వేదిక కానుంది.

 

ఎంఐఎఫ్‌ఎఫ్‌-2026 కోసం ప్రతినిధుల నమోదు

 

ఎంఐఎఫ్‌ఎఫ్‌ రానున్న ఎడిషన్‌ కోసం ప్రతినిధుల నమోదు ప్రక్రియ అధికారిక పోర్టల్‌లో ప్రారంభమైంది. ఆసక్తి గలవారు ఎంఐఎఫ్‌ఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://miff.in/en ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

 

నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు https://my.miff.in/dashboard/ ను సందర్శించవచ్చు.

 

నూతన వినియోగదారులు తప్పనిసరిగా ఖాతాను సృష్టించుకోవాలి. పాత వినియోగదారులు నేరుగా సైన్‌-ఇన్‌ అవ్వచ్చు. దరఖాస్తుదారులు, అవసరమైన వివరాలను అందించి, రూ.500 రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

 

విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఉచితం. విద్యార్థి విభాగం ద్వారా సమర్పించిన దరఖాస్తులను, అందించిన వివరాలు, పత్రాలను పరిశీలించిన అనంతరం పర్యవేక్షణ బృందం ఆమోదం తెలుపుతుంది.

 

ప్రతినిధుల నమోదు పక్రియకు సంబంధించిన సహాయం కోసం registration@miff.in ను ద్వారా సపోర్ట్‌ బృందాన్ని సంప్రదించవచ్చు. సాంకేతికపరమైన సందేహాల కోసం digitalteam@nfdcindia.com ను సంప్రదించవచ్చు.

19వ ఎంఐఎఫ్‌ఎఫ్‌ గురించి

 

ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఐఎఫ్‌ఎఫ్‌) ఒక చరిత్రాత్మక కార్యక్రమం. దక్షిణాసియాలోనే అత్యంత ప్రాచీన, అతిపెద్ద చలన చిత్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన ఈ వేడుక… డాక్యుమెంటరీ, కల్పిత లఘ చిత్రాలు, యానిమేషన్ చిత్రాలకు అంకితమైంది. 1990లో (ప్రారంభంలో బాంబే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంగా) ఏర్పాటైన ఎంఐఎఫ్‌ఎఫ్‌… భారతదేశ, అంతర్జాతీయ సినీ రూపకర్తల అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే శక్తిమంతమైన వేదికగా మారింది.

 

Hide quoted text

19వ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభ, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో అంతర్జాతీయ, భారతదేశ పోటీ విభాగాలుంటాయి. ఈ పోటీల్లో ప్రతిష్ఠాత్మకమైన బంగారు, వెండి శంఖాల అవార్డులతో పాటు రూ.55 లక్షల నగదు బహుమతులను అందిస్తారు. వి.శాంతారాం జీవన సాఫల్య పురస్కారం, అత్యంత వినూత్న, ప్రయోగాత్మక చిత్రానికి ప్రమోద్ పతి అవార్డు, సాంకేతిక ప్రతిభా పురస్కారాలు, ఉత్తమ విద్యార్థి చిత్ర పురస్కారం, ఉత్తమ డెబ్యూ దర్శకుడి పురస్కారం వంటివి ఈ వేడుకలో ప్రధాన గౌరవ పురస్కారాలు.

 

ఈ చలన చిత్రోత్సవంలో పోటీ విభాగాలే కాక ఇతర ఆసక్తికర విభాగాలున్నాయి. అందులో ప్రిజం విభాగం ద్వారా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ, నూతన ఒరవడిని సృష్టించిన చిత్రాలను ప్రదర్శిస్తారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన, అవార్డులు గెలుచుకున్న చిత్రాలతో ప్రత్యేక విభాగాలు, స్వతంత్ర చిత్రాలు, దేశంపై దృష్టి సారించే చిత్రాలు, తిరిగి నిర్మించిన క్లాసిక్ చిత్రాలు, వన్యప్రాణుల చిత్రాలు, విద్యార్థులు రూపొందించిన చిత్రాలు, న్యూ మీడియా, ఏఐ చిత్రాల వంటి మరెన్నో విభాగాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

 

గాలా స్క్రీనింగ్స్, రెడ్‌ కార్పెట్‌ కార్యక్రమాలు, మాస్టర్‌ క్లాసులు, ప్యానెల్‌ చర్చలు, వేవ్స్‌ డాక్‌ బజార్‌ వంటి కార్యక్రమాలను ఎంఐఎఫ్‌ఎఫ్‌-2026 నిర్వహించనుంది. చలన చిత్ర రంగంలోని ప్రతిభకు, సృజనాత్మక ఆలోచనల మార్పిడికి సమగ్ర వేడుకగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. వేవ్స్ డాక్ బజార్‌ మొదటిసారిగా ఇమ్మర్సివ్‌ మార్కెట్‌ను పరిచయం చేస్తోంది. ఇది ఇమ్మర్సివ్‌ కంటెంట్ క్రియేటర్లు, రూపకర్తలు, సాంకేతిక భాగస్వాముల కోసం ప్రత్యేక వేదిక. ముఖ్యంగా వీఆర్, ఏఆర్‌, ఎక్స్‌ఆర్‌, పరస్పర స్పందన ద్వారా కలిగే అనుభవాలపై దృష్టి సారించే ఈ మార్కెట్‌.. వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు, కొత్త కథా విధానాలను అన్వేషించేందుకు, అర్థవంతమైన సహకారాలను పెంపొందించుకునేందుకు వేదికగా నిలుస్తుంది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2259421   |   Visitor Counter: 58