ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త ఆధార్ యాప్‌కు విశేష ప్రజాదరణ... 3 నెలల్లో 2.1 కోట్ల డౌన్‌లోడ్‌లు


· దీని ద్వారా మొబైల్‌ నంబర్‌ నవీకరించిన ప్రజల సంఖ్య 28 లక్షలకు పైగానే...

· కాగిత రహిత గుర్తింపుగానే కాకుండా నిబంధనానుసరణ సహా ప్రజల చేతిలో నిర్దిష్ట సమాచార ప్రదాన సాధికారతకు కొత్త ఆధార్ యాప్ దోహదం

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 6:09PM by PIB Hyderabad

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆధార్ అనువర్తనానికి ప్రజల విశేషాదరణ లభిస్తోంది. దీంతో కేవలం మూడు నెలల్లో 2.1 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదు కాగా, సంబంధిత గుర్తింపు పనులన్నీ పూర్తి చేసుకోగలిగే వెసులుబాటు ప్రజల వేళ్ల మీదకు రావడంతో వారికి జీవన సౌలభ్యం కలిగింది.

ఈ యాప్‌ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబరుతోపాటు చిరునామా నవీకరణ సహా వివిధ సేవలను సులభంగా, ఏ వేళలోనైనా పొందుతున్నారని స్పష్టమవుతోంది.

ఈ మేరకు 28 లక్షల మందికి పైగా ప్రజలు కొత్త ఆధార్ యాప్‌ ద్వారా మొబైల్ నంబరును నవీకరించుకోగా, దాదాపు 6 లక్షల మంది చిరునామాను మార్చుకున్నారు.

ఆధార్ యాప్ అనేది ఒక భావితరం మొబైల్ అనువర్తనం. ఇది ఆధార్ కార్డుదారులు తమ గుర్తింపును వెంట తీసుకెళ్లడంతో పాటు అవసరమైన చోట చూపడానికి, పంచుకోవడానికి, నిర్ధారణకు ఒక సురక్షిత, సౌలభ్య, గోప్యత ప్రాధాన్యంగల మార్గం చూపింది.

దీనికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ వారి నమ్మకాన్ని మాత్రమేగాక ఆధార్ సేవల విస్తృత సౌలభ్యాన్ని, అది వినియోగదారు హితంగా మారడంలో కొత్త యాప్ పోషిస్తున్న పాత్రను ప్రస్ఫుటం చేస్తోంది. తద్వారా ఆధార్ కార్డుదారులకు జీవన సౌలభ్యం కల్పిస్తోంది.

హాజరు రుజువు దిశగా ముఖ ధ్రువీకరణ, ఒక్క క్లిక్‌తో బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ సదుపాయం, ప్రామాణీకరణ క్రమం, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సంప్రదింపు వివరాల సులభ పంపిణీ, ‘క్యూఆర్’ ఆధారిత సవరణకు తగిన కాంటాక్ట్ కార్డ్ వంటి ఆధునిక విశిష్టతలు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి.

సులభ వినియోగార్హంగా రూపొందించిన ఆధార్ యాప్, అనేక రకాల రోజువారీ వినియోగ సందర్భాల్లో ఉపయుక్తంగా ఉంటోంది. వీటిలో ‘ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీ క్యూఆర్ కోడ్ స్కానింగ్’ ద్వారా హోటల్ గదులు తీసుకునే సదుపాయం కూడా ఉంది. ఇది వయస్సు నిర్ధారణ, ఆసుపత్రిలో చేరిక, సందర్శకుల నిర్వహణ, ఈవెంట్లలో ప్రవేశం, గిగ్ వర్కర్లు, సేవా ప్రధాన భాగస్వాముల గుర్తింపు ధ్రువీకరణ వంటి అనేక విశిష్టతలు కూడా ఉన్నాయి.

ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్‌ (iOS) వేదికలు రెండింటిపైనా ఈ కొత్త ఆధార్ యాప్ అందుబాటులో ఉంది. కింది లింకు ద్వారా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు:

ఆండ్రాయిడ్‌: https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.pehchaan&hl=en_IN

ఐఓఎస్‌:

https://apps.apple.com/in/app/aadhaar/id6744029871

 

***


(రిలీజ్ ఐడి: 2258561) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Malayalam