MIFF banner

2026 జూన్ 16 నుంచి 18 వరకు వేవ్స్ డాక్ బజార్ రెండో సంచిక


వేవ్స్ డాక్ బజార్- 2026లో ఏర్పాటు చేసిన వ్యూయింగ్ రూం, వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబులో పాల్గొనేందుకు ప్రారంభమైన దరఖాస్తులు

ఆధునిక కథనానికి ఇమర్సివ్ మార్కెట్‌ను పరిచయం చేయనున్న వేవ్స్ డాక్ బజార్-2026

ముంబయిలోని ఎన్ఎఫ్‌డీసీ కాంప్లెక్సులో 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)తో పాటు 2026 జూన్ 16 నుంచి 18 వరకువేవ్స్ డాక్ బజార్ రెండో సంచిక జరుగుతుంది.

డాక్యుమెంటరీయానిమేషన్షార్ట్ ఫిల్మ్‌మేకర్లను ప్రోత్సహించేందుకువారి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు రూపొందించిన ముఖ్యమైనసమగ్రమైన వేదికే వేవ్స్ డాక్ బజార్ఇది సహకారాన్నీమార్గదర్శకత్వాన్నీ అందిస్తుందిఅలాగే మార్కెట్ప్రపంచ గుర్తింపును పొందే అవకాశాలను కల్పిస్తుందిఆడియో విజువల్ రంగంలోని నిష్ణాతులనువర్ధమాన ప్రతిభావంతులను ఒక్కచోట చేర్చాలని ఈ రెండో ఎడిషన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.  దర్శకులునిర్మాతలుపంపిణీదారులుప్రసారకర్తలుపెట్టుబడిదారులుసాంకేతిక భాగస్వాములను ఒక్క చోట చేర్చే వేదికగా పనిచేస్తుందినిర్మాణంలోపంపిణీలో వివిధ దశలకు తోడ్పాటునందిస్తుందిఅద్భుతమైన కథనాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసేలా సాయపడుతుందిఈ కార్యక్రమంలో నిపుణులుఅనుభవజ్ఞులతో మాట్లాడి పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణులుమార్కెట్ డిమాండ్లుపంపిణీ వ్యూహాలుప్రేక్షకుల ప్రాధాన్యాలను తెలుసుకోవచ్చు.

వేవ్స్ డాక్ బజార్‌లో ఉన్న మరో ముఖ్యమైన విభాగం వ్యూయింగ్ రూమ్ (వీఆర్). ఇక్కడ నమోదు చేసుకున్న ప్రతినిధులుఎంపిక చేసిన ప్రేక్షకులకు ఇటీవలే పూర్తయినపోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్న డాక్యుమెంటరీషార్ట్ ఫిలింయానిమేషన్ చిత్రాలను ప్రదర్శిస్తారు.

ఎంపిక చేసిన కొనుగోలుదారులుప్రోగ్రామర్లుపంపిణీదారులుపెట్టుబడిదారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక సురక్షితమైన వేదికగా దీన్ని రూపొందించారుఇది పంపిణీ ఒప్పందాలను కుదుర్చుకొనేందుకుసహ నిర్మాతలుప్రపంచవ్యాప్త అమ్మకాల ఏజెంట్లతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికిచలనచిత్రోత్సవాల్లో అవకాశాలను అన్వేషించడానికినిధులను పొందడానికి అవకాశాలను చిత్ర నిర్మాతలకు అందిస్తుందిప్రత్యేకంగా తీర్చిదిద్దిన వ్యవస్థ ద్వారా భాషవ్యవధినిర్మాణంలో ప్రస్తుతం కొనసాగుతున్న దశఇతర వివరాల ఆధారంగా కొనుగోలుదారులు చలనచిత్రాలను చూడొచ్చుఅదే సమయంలో ఎంపిక చేసిన చిత్రాలను వ్యూయింగ్ రూం క్యాటలాగులో పొందుపరిచికార్యక్రమం ప్రారంభమవడానికి ముందుగానే నమోదు చేసుకున్న ప్రతినిధులకు అందిస్తారు.

రఫ్ కట్ దశలో ఉన్న డాక్యుమెంటరీయానిమేషన్ చిత్రాల కోసం ప్రత్యేకంగా వర్క్-ఇన్-ప్రోగ్రెస్ (డబ్ల్యూఐపీల్యాబును రూపొందించారుప్రవేశ నియంత్రణ ఉన్న ఈ ల్యాబులో ఎంపిక చేసిన వారికి తమ ప్రాజెక్టులను మెరుగుపరుచుకొనేలా చిత్ర నిర్మాతలుఎడిటర్లుఅంతర్జాతీయ మార్గదర్శకుల నుంచి విలువైన అభిప్రాయాలుమార్గనిర్దేశంసూచనలు లభిస్తాయి.

వీఆర్ఏఆర్ఎక్స్ఆర్‌పై దృష్టి సారించి వేవ్స్ డాక్ బజార్లో ఇమర్సివ్ మార్కెట్ ఏర్పాటు

వేవ్స్ డాక్ బజార్లో మొదటిసారిగా ఇమర్సివ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నారుఇది కంటెంట్ రూపకర్తలునిర్మాతలుసాంకేతిక భాగస్వాములకు ప్రత్యేక వేదికగా పనిచేస్తుందివీఆర్ఏఆర్ఎక్స్ఆర్ లాంటి వాటిపై ఈ మార్కెట్ దృష్టి సారించిందివినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించడానికికథనంలో కొత్త విధానాలను అన్వేషించడానికిఅర్థవంతమైన సహకారాలను ప్రోత్సహించడానికి అవకాశాలను అందిస్తుంది.

డైనమిక్ ప్రోగ్రామింగ్పరిశ్రమ-కేంద్రీకృత కార్యక్రమాలతో డాక్యుమెంటరీలనుయానిమేషన్‌నులఘుచిత్రాల వ్యవస్థను బలోపేతం చేయడానికిఅదే సమయంలో సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకుఅంతర్జాతీయంగా ఎదిగేందుకు నూతన మార్గాలను అందుబాటులోకి తీసుకురావడానికి వేవ్స్ డాక్ బజార్ సిద్ధంగా ఉంది.

వేవ్స్ డాక్ బజార్ - 2026లో ఏర్పాటు చేసే వ్యూయింగ్ రూండబ్ల్యూఐపీ ల్యాబులో ప్రదర్శనకు ప్రారంభమైన దరఖాస్తులు

డాక్యుమెంటరీలనుయానిమేషన్ చలనచిత్ర దర్శకులను ఈ రంగానికి చెందిన నిపుణులతో అనుసంధానం చేసే వేవ్స్ డాక్ బజార్-2026లో ఏర్పాటు చేసే వ్యూయింగ్ రూంవర్క్-ఇన్-ప్రోగ్రెస్ (డబ్ల్యూఐపీల్యాబుల్లో ప్రదర్శనకు దరఖాస్తుల స్వీకరిస్తున్నారుఆసక్తి గల అభ్యర్థులు భారత కాలమాన ప్రకారం 2026 మే 15 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

2024లో డాక్ ఫిలిం బజార్ మొదటి సంచిక ప్రారంభానికి సంబంధించిన పీఐబీ ఫైల్ ఫొటోలు

అర్హతలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీయానిమేషన్ చిత్రాలకు ఈ కార్యక్రమం ఆహ్వానం పలుకుతోందిలఘుమధ్యస్థ నిడివిపూర్తి నిడివి ఉన్న ఫీచర్ చిత్రాలకు వేవ్స్ డాక్ బజార్-2026లో ప్రదర్శించేందుకు అర్హత కలిగి ఉంటాయిచిత్రాలు పూర్తి అయి ఉండాలి లేదా చాలా వరకు చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండాలిచిత్రీకరణ దశలో లేదా ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ప్రాజెక్టులకు అవకాశం లేదుఉత్సవాలుఅమ్మకాలుపంపిణీలేదా నిధుల కోసం చూస్తున్న చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకోవచ్చుఅంతర్జాతీయంగా పరిమితంగా లేదా అసలు గుర్తింపు లభించని చిత్రాలు పాల్గొనవచ్చు.

సమర్పణ ప్రక్రియ

మొదటి దశలో సమీక్ష కోసం పూర్తి చిత్రం లేదా రఫ్ కట్‌కు సంబంధించి పాస్‌వర్డ్ భద్రత ఉన్న స్క్రీనర్ లింకును సమర్పించాలిఈ దశలో ఎంపికైతే.. వ్యూయింగ్ రూం కోసం కనీసం 10 నిమిషాల ఫుటేజీని దర్శకులు సమర్పించాలిపూర్తి చిత్రాన్ని పంపించాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తున్నారుతుది చిత్రాలను సురక్షితంగా అప్‌లోడ్ చేసిఅనుమతించిన వారికి మాత్రమే అందుబాటులో ఉంచుతారు.

అంతర్జాతీయ వేదికలపై తమ చిత్రాలను ప్రదర్శించేడాక్యుమెంటరీయానిమేషన్ పరిశ్రమలో కీలకమైన వ్యక్తులతో అనుసంధానమయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఫిలింమేకర్లను ఆహ్వానిస్తున్నారు.

ఆసక్తి కలిగిన వారు దిగువ పేర్కొన్న లింక్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

https://my.miff.in/vr/start/ 

వీఆర్డబ్ల్యూఐపీకి సంబంధించిన మరిన్ని వివరాలునియమాలునియంత్రణలుఎఫ్ఏక్యూలను ఇక్కడ చూడొచ్చు.

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2258378   |   Visitor Counter: 53