ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్ రూపురేఖలు మారుతున్నాయంటూ వస్తున్న వార్తలపై వివరణ
प्रविष्टि तिथि:
03 MAY 2026 4:16PM by PIB Hyderabad
ఈ సంవత్సరం చివరి నాటికి ఆధార్ కొత్త రూపంలో ఉంటుందనీ, ఇక కేవలం ఒక ఫోటో, క్యూఆర్ కోడ్‌లకే పరిమితం కావచ్చంటూ కొన్ని వార్తలు, సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయి.
ఇది వాస్తవ సమాచారం కాదు. అటువంటి మార్పుల గురించి ఎలాంటి ప్రణాళికా లేదు.
ఇలాంటి వార్తలు, సోషల్ మీడియా పోస్టులు ప్రజల్లో అనవసర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
ప్రజలు సాధారణంగా ఇటువంటి వార్తల్ని, సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోకుండా... యూఐడీఏఐ వారి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అందించే అధికారిక సమాచారాన్ని, పీఐబీ ద్వారా జారీ చేసిన పత్రికా ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించడమైనది. ఇటువంటి సమాచారాన్ని ప్రోత్సహించవద్దని మీడియాకి కూడా సూచించారు.
***
(रिलीज़ आईडी: 2257656)
आगंतुक पटल : 74