ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన కారణంగా ప్రాణ నష్టం... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 29 APR 2026 11:22PM by PIB Hyderabad

కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన దురదృష్టకర ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను శ్రీ మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కర్నాటకలోని బెంగళూరులో ఓ గోడ కూలిపోయిన ఘటన దురదృష్టకరం. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు: ప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2256866) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam