ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిక్కిమ్ 50వ రాష్ట్రావతరణ దినోత్సవాల ముఖ్యాంశాల్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 3:08PM by PIB Hyderabad

సిక్కిమ్ రాష్ట్ర అవతరణ 50వ దినోత్సవ ముఖ్యాంశాల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. సిక్కిమ్ సాంస్కృతిక వారసత్వాన్ని, అక్కడి  సంప్రదాయాల్ని, దేశాభివృద్ధికి సిక్కిమ్ అందించిన తోడ్పాటును  ఆయన ఎంతగానో ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి వరుసగా కొన్ని సందేశాలు పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు..:
‘‘సిక్కిమ్ ప్రజానీకం అందించిన స్నేహానికి, ఆశీర్వాదాలకి ప్రతిగా నా వంతు ప్రయత్నాల్లో నేను ఎంత మాత్రం వెనుకడుగు వేయనని మీకు హామీనిస్తున్నాను.
‘‘పర్యావరణానుకూల సంబంధిత పర్యటనావకాశాలు సిక్కిమ్‌లో ఎన్నో ఉన్నాయి. మేం దీంతో పాటు దేశవ్యాప్తంగా కూడా పర్యటన రంగ అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాం’’.
ఈ విషయంలో నేను ప్రత్యేకంగా విన్నవించేదేమిటంటే...
‘‘సిక్కిమ్ యువతీయువకులు క్రీడలంటే అమితమైన ఉత్సాహాన్ని కనబరుస్తారు. వారు  ఇప్పటికే తమ ప్రతిభను మైదానంలో నిరూపించారు.
‘‘వారికి మెరుగైన సదుపాయాలనూ, ప్రతిభకు పదును పెట్టుకొనే అవకాశాలనూ  కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.’’
‘‘ప్రస్తుతం ప్రపంచం మన్నిక కలిగిన జీవనశైలిని గురించి చర్చిస్తోంది. మన ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా సిక్కిమ్ ఈ దిశగా ఒక ప్రముఖ కేంద్రంగా ఎదుగుతుండడం చూసి నేను సంతోషిస్తున్నాను...’’
‘‘గాంగ్‌టక్‌లో సిక్కిమ్ సాంస్కృతిక వారసత్వాన్ని తిలకించడం మరపురాని అనుభూతులను అందించింది.
ఒక్క కార్యక్రమంలో సంపూర్ణ భారత్ ఒకే చోటుకు చేరిందా! అని నాకనిపించింది. మంత్రముగ్ధుల్ని చేసే సమర్పణలు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’కు సంబంధించిన ఒక అద్భుత సన్నివేశాన్ని కళ్లెదుట నిలిపాయి.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను’’.
‘‘గాంగ్‌టక్‌లో వెల్లువెత్తిన ఉత్సాహం, స్నేహం నాలో కొత్త శక్తిని ప్రవహింప చేశాయి. సిక్కిమ్‌ సోదరీ, సోదరులకు వారి రాష్ట్ర 50వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మళ్లీ ఓసారి అభినందనలను తెలియజేస్తున్నాను. దేశాభివృద్ధిలో సిక్కిమ్ అందిస్తున్న తోడ్పాటును చూసుకొని భారత్ ఎంతో గర్వపడుతోంది. సిక్కిమ్ ప్రజలు అనేక రంగాల్లో శ్రేష్ఠ ప్రదర్శననిచ్చారు. వారి ఈ ఉత్కృష్ట స్వభావానికి వారు ప్రశంసాపాత్రులు’’.
‘‘సిక్కిమ్ రాష్ట్ర అవతరణ తాలూకు 50వ ఉత్సవాల దృశ్యాలు మరికొన్ని ఇవిగో..’’

***


(రిలీజ్ ఐడి: 2256610) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Gujarati , Odia , Kannada , Malayalam