ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బల్గేరియా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన శ్రీ రూమెన్ రాదెవ్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 21 APR 2026 10:00PM by PIB Hyderabad

బల్గేరియాలో ఇటీవల పూర్తయిన పార్లమెంటు ఎన్నికలలో శ్రీ రూమెన్ రాదెవ్‌తో పాటు ఆయన పార్టీ ‘ప్రోగ్రెసివ్ బల్గేరియా’ గెలిచిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘భారత్బల్గేరియా మధ్య మైత్రీపూర్వకబహుముఖీన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు మన విస్తృత సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘బల్గేరియాలో ఇటీవల పూర్తయిన పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించినందుకు శ్రీ రూమెన్ రాదెవ్‌తో పాటు ఆయన పార్టీ ప్రోగ్రెసివ్ బల్గేరియాకు కూడా హార్దిక అభినందనలు.

భారత్బల్గేరియా మధ్య మైత్రీపూర్వకబహుముఖీన సంబంధాల్ని మరింత పటిష్ఠ పరుచుకోవడానికీఅలాగే మన విస్తృత సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికీ కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2255154) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam