ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాయ్‌పూర్‌లో డీజీపీ/ఐజీపీ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 NOV 2025 8:24PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాయ్‌పూర్‌లో జరిగిన డైరెక్టర్ జనరళ్లు, ఇన్‌స్పెక్టర్ జనరళ్ల (డీజీపీ/ఐజీపీ) సదస్సు మొదటి రోజు సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ భద్రతా వ్యవస్థలోని వివిధ అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రతా రంగంలో ఉత్తమ పద్ధతులను, ఆవిష్కరణలను పంచుకోవడానికి ఈ సదస్సు ఒక కీలకమైన వేదికగా పనిచేస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు. 

"రాయ్‌పూర్‌లో జరిగిన డీజీపీ/ఐజీపీ సదస్సు మొదటి రోజు, భారతదేశ భద్రతా వ్యవస్థలోని వివిధ అంశాలపై విస్తృత చర్చలకు వేదికైంది. ఈ రంగంలోని ఉత్తమ పద్ధతులను, ఆవిష్కరణలను పంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2254494) సందర్శకుల సూచీ సంఖ్య : : 29