ప్రధాన మంత్రి కార్యాలయం
భూటాన్ నాలుగో రాజుతో కలిసి, గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2025 9:54AM by PIB Hyderabad
భూటాన్ నాలుగో రాజు గౌరవ జిగ్మే సింగ్యే వాంగ్ చుక్ ఇవాళ థింఫూలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇచ్చారు.
భూటాన్ నాలుగో రాజు 70వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాజు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని భారత ప్రభుత్వం, ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్-భూటాన్ స్నేహబంధం మరింత పటిష్టమవటానికి నాలుగో రాజు అందించిన నాయకత్వం, సలహా, మార్గదర్శకత్వానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పరం ఆసక్తి ఉన్న అంశాలపై ఇద్దరు నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రజలను దగ్గర చేసే ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాలపై చర్చించారు.
థింపూలో జరిగ్ గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్‌లో భాగంగా చాంగ్లిమెథాంగ్ స్టేడియంలో నిర్వహించిన కాలచక్ర దీక్షా కార్యక్రమంలో భూటాన్ ప్రస్తుత రాజు, నాలుగో రాజు, భూటాన్ ప్రధానమంత్రితో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ప్రార్థనలకు భూటాన్ ప్రధాన మఠాధిపతి జే ఖెంఫో అధ్యక్షత వహించారు.
***
(రిలీజ్ ఐడి: 2254312)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam