ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడిని ఖండించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 OCT 2025 8:45PM by PIB Hyderabad
సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై జరిగిన దారుణమైన దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్రంగా ఖండించారు.
ఈ సంఘటన తర్వాత జస్టిస్ గవాయ్‌తో మాట్లాడిన మోదీ.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆయన సంయమనం పాటించటం పట్ల అభినందనలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ గారితో మాట్లాడాను. ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి హేయమైన ఘటనలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది.
దీన్ని ఎదుర్కోవటంలో జస్టిస్ గవాయ్ ప్రదర్శించిన సంయమనాన్ని నేను అభినందించాను. ఇది న్యాయ విలువల పట్ల ఆయన నిబద్ధతను, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడాన్ని తెలియజేస్తోంది”
(रिलीज़ आईडी: 2254284)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam