ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం... విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 9:50AM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ఆప్తులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50,000 వంతున అందిస్తారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:
‘‘ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లాలో రోడ్డు దుర్ఘటన అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను అందిస్తారు. గాయపడ్డ వారికి రూ.50,000 వంతున అందిస్తారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.

 

***


(రిలీజ్ ఐడి: 2252449) సందర్శకుల సూచీ సంఖ్య : : 33