ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఔషధ రంగంలో భారత్‌ సాధిస్తున్న వృద్ధిపై ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 1:11PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ప్రపంచ ఔషధశాల స్థాయి నుంచి ఆవిష్కరణల కేంద్రంగా భారత ఔషధ రంగం పరిణామం చెందుతోందని ఈ వ్యాసం తెలుపుతోంది. ఈ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీకి నాయకత్వం వహించడానికి భారత్‌ సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విస్తృతమైన పరిశోధనలు, అభివృద్ధి, బయోలాజిక్స్, బయోసిమిలార్స్, అత్యాధునిక చికిత్సా విధానాలపై దృష్టి సారించినట్లు ఈ కథనం పేర్కొంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘ప్రపంచపు ఔషధశాల స్థాయి నుంచి ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతూ.. భారత ఫార్మా రంగం విలువైన ప్రస్థానాన్ని సాగిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి, బయోలాజిక్స్, బయోసిమిలర్స్, అత్యాధునిక చికిత్సా విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఈ రంగంలో ప్రపంచవ్యాప్త పోటీలో భారత్ ఎలా నాయకత్వం వహించబోతుందో వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా రాసిన ఈ అద్భుత విశ్లేషణను ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి’’ 

https://www.thehindubusinessline.com/opinion/india-moving-up-the-pharma-value-chain/article70858640.ece


(రిలీజ్ ఐడి: 2251894) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Kannada