భారత ఎన్నికల సంఘం
శాసనసభలకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు-2026 అస్సాం, పుదుచ్చేరిల్లో అత్యధికంగా పోలింగ్ నమోదు
నాడు పోస్టు చేయడమైనది:
09 APR 2026 8:58PM by PIB Hyderabad
-
1. అస్సాం, కేరళ, పుదుచ్చేరి శాసనసభల సాధారణ ఎన్నికలకు, 3 రాష్ట్రాల్లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడా చిన్నచిన్న సంఘటనలు మినహా అంతటా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
2. అస్సాంలో 85.38 శాతం, పుదుచ్చేరిలో 89.83 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇది అత్యధిక ఓటింగ్ శాతం. గతంలో అస్సాంలో అత్యధికంగా 84.67 శాతం (2016 అసెంబ్లీ ఎన్నికలు), పుదుచ్చేరి 86.19 శాతం (2011 అసెంబ్లీ ఎన్నికలు) పోలింగ్ నమోదైంది.
3. పోలింగ్ వివరాలు (శాతాల్లో) ఈ విధంగా ఉన్నాయి:
|
రాష్ట్రం, యూటీ
|
పోలింగ్ శాతం (%)
|
|
పురుషులు
|
మహిళలు
|
3వ వర్గం
|
మొత్తం
|
|
శాసనసభల సాధారణ ఎన్నికలు
|
|
అస్సాం
|
84.80
|
85.96
|
36.84
|
85.38
|
|
కేరళ
|
75.01
|
80.86
|
57.04
|
78.03
|
|
పుదుచ్చేరి
|
88.09
|
91.33
|
91.81
|
89.83
|
|
అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికలు
|
|
కర్ణాటక
1. బాగల్‌కోట్-24
|
68.69
|
68.68
|
0.07
|
68.70
|
|
2. దావణగెరె సౌత్-107
|
68.55
|
68.55
|
0.08
|
68.55
|
|
నాగాలాండ్
1. కోరిడాంగ్-28
|
79.34
|
85.14
|
-
|
82.21
|
|
త్రిపుర
1. ధర్మనగర్-56
|
79.80
|
80.26
|
-
|
80.04
|
-
ఈసీఐనెట్ పోర్టల్‌లో పీఆర్ఓలు అందించిన చేసిన డేటా ప్రకారం.. ఇంకా 3,469 పీఎస్‌ల సమాచారం అప్‌డేట్ కావాల్సి ఉంది.
-
ఇవి ప్రాథమిక గణాంకాలు. ఇందులో సర్వీసు ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ల వివరాలను చేర్చలేదు. తుది గణాంకాలను ఇండెక్స్ కార్డు ద్వారా ఈసీఐ వెల్లడిస్తుంది.
4. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ ఎస్.ఎస్. సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) శ్రీ జ్ఞానేష్ కుమార్.. లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
5. అస్సాం, కేరళ, యూటీ అయిన పుదుచ్చేరిలోని 296 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ జరిగిన ఎన్నికల్లో సుమారు 5.31 కోట్లకు పైగా ఓటర్లు, ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటితో పాటు 3 రాష్ట్రాల్లోని (కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర) 4 ఏసీలకు ఉపఎన్నికలు నిర్వహించారు.
6. ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ (ఐఈవీపీ)లో భాగంగా 22 దేశాలకు చెందిన 38 మంది ప్రతినిధులు ఎన్నికల నిర్వహణను ప్రత్యక్షంగా వీక్షించారు.
7. నిన్న రాత్రి 2.5 లక్షల మందికిపైగా పోలింగ్ సిబ్బంది, వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన 1,899 మంది అభ్యర్థులు నియమించిన 1.8 లక్షల మందికి పైగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇవాళ ఉదయం 7 గంటల్లోపే మాక్ పోలింగ్ పూర్తయింది. అనంతరం 63,084 పోలింగ్ కేంద్రాల్లో ఓకే సమయంలో పోలింగ్ ప్రారంభమైంది.
8. ఈసీఐ తాజా ఆదేశాల ప్రకారం.. పోలింగ్ ముగిసిన వెంటనే, పోలింగ్ కేంద్రాల నుంచి ప్రిసైడింగ్ అధికారులు బయలుదేరక ముందుగానే ఓటింగ్ గణాంకాలను అప్‌డేట్ చేశారు. ఫలితంగా ఓటింగ్ వివరాలను సుమారుగా వెల్లడించటంలో ఆలస్యం జరగలేదు.
9. ఓటర్లకు అనుకూలంగా ఉండే ఎన్నో నూతన కార్యక్రమాలను ఈ ఎన్నికల్లో అమలు చేశారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల స్పష్టమైన కలర్ ఫోటోలు, మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎండీఎఫ్), సులభంగా చదవగలిగేలా కొత్తగా రూపొందించిన ఓటరు సమాచార స్లిప్పులు (వీఐఎస్), ప్రతి పోలింగ్ కేంద్రానికి ఓటర్ల సంఖ్యను గరిష్ఠంగా 1,200కు పరిమితం చేయటం వంటి చర్యలు తీసుకున్నారు.
10. దివ్యాంగ ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో వీల్ఛైర్లు, వాలంటీర్లను కేటాయించారు. పీడబ్ల్యూడీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించారు.
11. జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజవర్గాల వారీగా సుమారు ఓటింగ్ శాతం వివరాలు ఈసీఐనెట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2250736)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9