ప్రధాన మంత్రి కార్యాలయం
పీఎం ముద్రా యోజన 11వ వార్షికోత్సవం
విజయవంతమైన ఈ పథకంపై ఆలోచనల్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
కలలు కనేందుకు ఆత్మవిశ్వాసంతో పాటు వాటిని నెరవేర్చుకొనే మార్గాలనూ లక్షల మందికి పీఎం ముద్రా యోజన చూపించి
వారిని శక్తిమంతుల్ని చేసిందంటూ కొన్ని ముఖ్యాంశాల్ని వెల్లడించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 1:18PM by PIB Hyderabad
పీఎం ముద్రా యోజన విజయవంతం కావడంపై ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనలను ఈ రోజు పంచుకున్నారు. ఈ పథకం లక్షల మందికి కలలను కనే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతో పాటు ఆ స్వప్నాలను నెరవేర్చుకొనేందుకు మార్గాలనూ చూపి వారిని ఎలా శక్తిమంతుల్ని చేసిందీ ఆయన వివరించారు.
మన ప్రజల ఆకాంక్షలపై భరోసా పెట్టుకొని అడ్డంకుల్ని తొలగించి ఈ కార్యక్రమం భారత్ అంతటా ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తిని పటిష్ఠపరిచిందని ప్రధానమంత్రి అన్నారు. అవసరాలను అందుబాటులోకి తెచ్చి, ప్రయత్నాల్ని ప్రోత్సహించే ఒక ఆర్థిక సహాయ స్రవంతిగా పీఎం ముద్రా యోజన ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వ్యవస్థలో మార్పును తీసుకువచ్చే దక్షత ఈ పథకానికి ఉందని ప్రధానమంత్రి చెబుతూ, ఇది ప్రతి కలా సాకారం అయ్యేందుకు కావలసిన సహాయాన్ని అందిస్తూ యువ శక్తినీ, మహిళా శక్తినీ ఎలా సకారాత్మకంగా ప్రభావితం చేస్తున్నదీ వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అనేక సందేశాలను ప్రధానమంత్రి పొందుపరుస్తూ -
‘‘లక్షల మందికి కలలు కనే ఆత్మవిశ్వాసంతో పాటు వాటిని పండించుకొనేందుకు తగ్గ వనరులను కూడా అందజేస్తూ రుణ లభ్యత ప్రక్రియకు సరికొత్త అర్థాన్ని పీఎం ముద్రా యోజన ఇచ్చింది’’.
‘‘ఈ పథకం మన వాళ్ల ఆకాంక్షలను నమ్ముతూ, అవరోధాలను తొలగిస్తూ, భారత్ నలుమూలలా ఔత్సాహిక పారిశ్రామికత్వ భావనను బలోపేతం చేసింది’’.
‘‘ముద్రా యోజనకు ఉన్న పరివర్తనపూర్వక సామర్థ్యం సంగతేంటో చూడండి..ఇది మన యువ శక్తిపైనా, మన మహిళా శక్తి పైనా ఎంతటి సానుకూల ప్రభావాన్ని చూపిందో కదూ’’.
‘‘అవకాశాలు అతి చేరువలోనే ఉండే... ప్రయత్నాలకు ప్రోత్సాహం దక్కే, ప్రతి కలనూ నిజం చేసుకొనేందుకు కావలసిన సాయాన్ని సమకూర్చే ఆర్థిక సహాయ స్రవంతికి పీఎం ముద్రా యోజన ప్రతీక’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2250014)
సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada