ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సోషలిస్టు రిపబ్లిక్ వియత్నాం అధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా శ్రీ తో లామ్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 APR 2026 12:32PM by PIB Hyderabad

శ్రీ తో లామ్... వియత్నాం అధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు.
కొత్త అధ్యక్షుని నాయకత్వంపై ప్రధానమంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారుకాల పరీక్షకు తట్టుకొని నిలిచిన భారత్వియత్నాంల మైత్రి రాబోయే కాలంలో మరింత బలోపేతం అవుతుందని ప్రధాని అన్నారురెండు దేశాల ప్రజలతో పాటు ఈ ప్రాంతం కూడా పురోగమించేలాసమృద్ధి పథంలో పయనించేలా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 
-
‘‘
వియత్నాం అధ్యక్ష పదవికి శ్రీ తో లామ్ ఎన్నికైన సందర్భంగా ఆయనకు హార్దిక అభినందనలుకాలపరీక్షకు తట్టుకొని నిలిచిన మన రెండు దేశాల మైత్రి ఆయన నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని నేను నమ్ముతున్నానురెండు దేశాల ప్రజలతో పాటు ఈ ప్రాంతం కూడా పురోగమించేలాసమృద్ధి పథంలో పయనించేలా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి మనం కలిసి పని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249622) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada