వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలపై సమీక్షించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


వడగళ్ల వాన, భారీ వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టాన్ని సమీక్షించాలని అధికారులకు శ్రీ చౌహాన్ ఆదేశం

రైతు సోదరీ సోదరులు బాధపడొద్దు.. ఈ సంక్షోభ సమయంలో మోదీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది: శ్రీ చౌహాన్

प्रविष्टि तिथि: 05 APR 2026 12:15PM by PIB Hyderabad

పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలువడగళ్ల వానల తీవ్రతను.. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారువడగళ్ల వానభారీ వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టాన్ని సమీక్షించాలని వ్యవసాయ శాఖ అధికారులను శ్రీ చౌహాన్ ఆదేశించారు.

సంబంధిత రాష్ట్రాల అధికారులను సంప్రదించిక్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారురైతు సోదరీ సోదరులు బాధపడవద్దనిఈ సంక్షోభ సమయంలో మోదీ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు.

వడగళ్ల వానభారీ వర్షాల కారణంగా పంటలకు వాటిల్లిన నష్టంపై సంబంధిత రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో శ్రీ చౌహాన్ ఈ రోజు చర్చిస్తారు.  

 

***


(रिलीज़ आईडी: 2249204) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Kannada