ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో దుర్ఘటన.. విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


• ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 26 MAR 2026 11:19AM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో దుర్ఘటనపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం తెలిపారుఈ దుర్ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారుఇదే ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో జరిగిన దుర్ఘటన బాధాకరంఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నానుఈ దుర్ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాంక్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారంగా అందిస్తాంప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొంది

 

***


(రిలీజ్ ఐడి: 2245660) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Kannada