ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన శ్రీలంక అధ్యక్షుడు


ప్రపంచ ఇంధన భద్రతకు కలుగుతున్న అంతరాయాలపై చర్చించిన ఇరువురు నేతలు

నౌకాయాన మార్గాలను బహిరంగంగా, సురక్షితంగా ఉంచే విషయానికి ఉన్న ప్రాముఖ్యతను పునరుద్ఘాటించిన ఇద్దరు నేతలు

ద్వైపాక్షిక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను మెరుగుపరచడం వంటి వివిధ అంశాల విషయంలో పురోగతిని సమీక్షించిన ఇరువురు నేతలు

ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2026 9:10PM by PIB Hyderabad

ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఫోన్ చేసి మాట్లాడారు. 

ప్రపంచ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతున్న అంతరాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల గురించి ఇరువురు నేతలు చర్చించారు.

ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా నౌకాయాన మార్గాలను బహిరంగంగా, సురక్షితంగా ఉంచే విషయానికి ఉన్న ప్రాముఖ్యతను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.

భారత్-శ్రీలంక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను మెరుగుపరచే విషయంలో వివిధ కార్యక్రమాల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు.

భారత్ అనుసరిస్తున్న 'ఇరుగుపొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’ అనే విధానం, 'మహాసాగర్' దార్శనికతకు అనుగుణంగా ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

ఇరువురు నేతలు నిరంతరం ఒకరికొకరు అందుబాటులో ఉండేందుకు అంగీకరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2244843) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Gujarati , Kannada