ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ఏఐ విధానం జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉందంటూ వివరిస్తున్న వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 1:16PM by PIB Hyderabad
కృత్రిమ మేథో ఆధారిత నేటి సాంకేతిక రంగంలో వస్తున్న ఆవిష్కరణల విజయాలను వివరిస్తూ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
కృత్రిమ మేధ రంగంలో భారత్ దృక్పథం జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉంటూనే ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలతో బలంగా ముడిపడిందని ఈ వ్యాసంలో స్పష్టం చేశారు. భారత ఏఐ వ్యూహం స్పష్టంగా, మానవ ప్రయోజనాలకు పెద్దపీట వేసేదిగా, అన్ని వర్గాలను కలుపుకొని పోయేదిగా, అంతర నిర్వహణీయమైందిగా ఉండడంతో పాటు సార్వభౌమ సామర్థ్య పునాదిపై నిర్మితమైందని ఈ వ్యాసంలో పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘ఏఐ చోదకశక్తిగా ముందుకుసాగుతున్న సాంకేతిక యుగంలో, భారత్ ఆవిష్కరణల గాథ ప్రపంచ భాగస్వామ్యాలతోనూ లోతుగా అనుసంధానమైందని కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు.
ఏఐ పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరి జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉంది. అది స్పష్టంగానూ, మానవ ప్రయోజనాలకు పెద్ద పీట వేసేదిగానూ, అన్ని వర్గాలను కలుపుకొని పోయేదిగానూ, అంతర నిర్వహణీయమైందిగానూ, సామర్థ్యం పరంగా చూసినప్పుడు సార్వభౌమాధికారంతో కూడుకొన్నదిగానూ ఉందని ఆయన స్పష్టం చేస్తున్నార’’ని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2244032)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11