సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యాడ్‌ట్రస్ట్ సమ్మిట్-2026లో ప్రసంగించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి


బాధ్యతాయుతమైన, విశ్వసనీయమైన ప్రకటనల వ్యవస్థకు పిలుపు

ప్రామాణికతను కాపాడుకోవడం ద్వారా ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, తప్పుదోవ పట్టించే ప్రచారాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి

ప్రకటనల్లో అవగాహన, సమ్మతిని ప్రోత్సహించడానికి యాడ్‌ట్రస్ట్ సమ్మిట్-2026లో యాడ్ లా కంపెండియం ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 4:22PM by PIB Hyderabad

ముంబయిలో ఈ రోజు జరిగిన యాడ్‌ట్రస్ట్ సమ్మిట్-2026లో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ... "ప్రకటనలు కేవలం విస్తృతిని పెంచడమే కాకుండావిశ్వాసాన్నీ పెంపొందించాలిఅని వ్యాఖ్యానించారుదేశంలో బాధ్యతాయుతమైనపారదర్శకమైనవిశ్వసనీయమైన ప్రకటనల వ్యవస్థ ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారుముఖ్యంగా ఈ రంగం పరిమాణంలోసంక్లిష్టతలోప్రభావంలో ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ఇది మరింత అవసరమని ఆయన పేర్కొన్నారుఈ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ముఖ్యంగా డిజిటల్ రంగంలో జవాబుదారీతనం ఎంతో అవసరమని శ్రీ జాజు ఉద్ఘాటించారుసమాచారప్రసార మంత్రిత్వ శాఖ విధానం విశ్వాసాన్ని పెంపొందించడంవృద్ధికి మద్దతునివ్వడంబాధ్యతను నిర్ధారించడంపైనే దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు.

అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐనిర్వహించిన యాడ్‌ట్రస్ట్ సమ్మిట్-2026 మొదటి సంచిక... బాధ్యతాయుతమైన ప్రకటనలకు సంబంధించిన కీలక సమస్యలపై చర్చించడానికి ప్రకటనలుమీడియాటెక్నాలజీప్రభుత్వ రంగాల ప్రతినిధులను ఒకచోట చేర్చిందిఈ చర్చలు అభివృద్ధి చెందుతున్న పోకడలుచట్టపరమైన నిబంధనలుప్రకటనల పద్ధతులపై ఆధునిక సాంకేతికతల ప్రభావంపై ప్రధానంగా దృష్టి సారించాయి.

సదస్సులో శ్రీ జాజు మాట్లాడుతూ... ప్రకటనలు కేవలం ఒక వాణిజ్య కార్యక్రమం మాత్రమే కాదనీఅవి మార్కెట్లను తీర్చిదిద్దుతాయనిబ్రాండ్‌లను నిర్మిస్తాయనివినియోగదారులకు సమాచారం అందిస్తాయనిసంస్కృతిని సూచిస్తాయనిఆకాంక్షలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారుభారత్ వంటి పెద్దవేగంగా డిజిటలైజ్ అవుతున్న దేశంలో ఆవిష్కరణలుఆర్థిక కార్యకలాపాలుకంటెంట్ సృష్టిసమ్మిళితత్వానికి ప్రకటనలు ఒక కీలక చోదక శక్తిగా మారాయన్నారుడిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లుకృత్రిమ మేధ ఇప్పుడు బ్రాండ్‌లుఅంకురసంస్థలుస్థానిక వ్యాపారాలుసృష్టికర్తలు పెద్ద ఎత్తున వినియోగదారులను చేరుకోవడానికి వీలు కల్పిస్తున్నాయనీ... తద్వారా ప్రవేశ అవరోధాలను తగ్గించిభాగస్వామ్యాన్నీ విస్తరిస్తున్నాయని శ్రీ జాజు వ్యాఖ్యానించారు.

బలహీన వర్గాలను తరచుగా లక్ష్యంగా చేసుకునే చేసే ఆర్థిక మోసాలుతప్పుదోవ పట్టించే పెట్టుబడి ప్రచారాలుమోసపూరిత ఉద్యోగ ఆఫర్లు వంటి డిజిటల్ ప్రకటనలతో ముడిపడి ఉన్న ప్రమాదాలనూ ప్రస్తావించిన శ్రీ జాజు... ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారువాణిజ్య ప్రసంగం భావప్రకటనా స్వేచ్ఛలో భాగమే అయినప్పటికీ... తప్పుదోవ పట్టించేమోసపూరిత ప్రకటనలను నియంత్రించవచ్చనీనియంత్రించాలనీ ఆయన పేర్కొన్నారు.

ప్రకటనల్లో ఏఐ పాత్రడీప్‌ఫేక్‌లుడార్క్ ప్యాటర్న్‌లుపెరుగుతున్న యాంటీ-ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ధోరణి వంటి కొత్తగా తలెత్తుతున్న సమస్యలపై ఈ సదస్సులో కీలక చర్చలు జరిగాయిప్రకటనకర్తలు రీచ్‌తో పాటు విశ్వసనీయతపైనా దృష్టి పెట్టాలనీ... క్రియేటర్లుఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రామాణికతను పాటిస్తూతప్పుదోవ పట్టించే ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల నమ్మకాన్ని కాపాడుకోవాలని శ్రీ జాజు కోరారు.

బాధ్యతాయుతమైన ప్రకటనల కోసం ఐదు కీలక సూత్రాలను శ్రీ జాజు ప్రధానంగా వివరించారుఅవిi) అన్ని కమ్యూనికేషన్లలో సత్యసంధత రాజీపడలేనిదిగా ఉండాలి. ii) ప్రకటనలుస్పాన్సర్‌షిప్‌లుప్రచార సంబంధాలను గుర్తించడంలో పారదర్శకత అత్యవసరం. iii) అన్ని రకాల కంటెంట్ రూపకల్పనపంపిణీకి బాధ్యత మార్గదర్శకంగా ఉండాలి. iv) బలహీన వర్గాలకుముఖ్యంగా పిల్లల రక్షణకు ప్రాధాన్యమివ్వాలి. v) జవాబుదారీతనంతో కూడిన ఆవిష్కరణలుసాంకేతికసృజనాత్మక పురోగతులు విశ్వాసాన్ని బలహీనపరచకుండాబలోపేతం చేసేలా నిర్ధారించాలి.

సదస్సు సందర్భంగా శ్రీ సంజయ్ జాజుతో పాటు ఏఎస్‌సీఐ సెక్రటరీ జనరల్సీఈవో శ్రీమతి మనీషా కపూర్... మాడిసన్ ఛైర్మన్ శ్రీ సామ్ బల్సారా... ఏఎస్‌సీఐ ఛైర్మన్పెడిలైట్ ఇండస్ట్రీస్ ఎమ్‌డీ శ్రీ సుధాన్షు వత్స్... ఏఎస్‌సీఐ బోర్డు సభ్యులు శ్రీ ప్రవీణ్ త్రిపాఠి... ఖైతాన్ అండ్ కో భాగస్వాములు శ్రీ ఇషాన్ జోహ్రిశ్రీమతి తనూ బానర్జీలు సంయుక్తంగా 'యాడ్ లా కంపెండియం'ను ప్రారంభించారుఇది పరిశ్రమ వ్యాప్తంగా మరింత అవగాహనఅర్థం చేసుకోవడంఅనుగుణంగా ఉండడం వంటి వాటిని ప్రోత్సహించడానికి రూపొందించినదిప్రకటనల చట్టాలునిబంధనల కోసం ఒక ఆచరణాత్మక మార్గదర్శిగా ఇది ఉపయోగపడుతుంది.

ఏఎస్‌సీఐ నాయకత్వంవిక్రయదారులుడిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లున్యాయవాద సంఘాల సభ్యులు సహా ప్రకటనల పరిశ్రమకు చెందిన భాగస్వాములతో కేంద్ర సమాచారప్రసార శాఖ కార్యదర్శి ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2242215) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , Khasi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada