|
ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఉత్తర ప్రదేశ్‌లో బారాబంకి-బహ్రాయిచ్ మధ్య (101.515 కి.మీ.) నాలుగు వరుసల జాతీయ రహదారి-927 నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం
· రూ.6969.04 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూపుదిద్దుకోనున్న వినియోగ నియంత్రిత రహదారి
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 4:10PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లో బారాబంకి-బహ్రాయిచ్ మధ్య (101.515 కి.మీ.) 4 వరుసల వినియోగ నియంత్రిత జాతీయ రహదారి-927 నిర్మాణానికి ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. మొత్తం రూ.6969.04 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానం కింద ఈ రహదారి పనులను చేపడతారు.
ఇది రాష్ట్రంలోని జాతీయ రహదారి-927’ పరిధిలోని బారాబంకి-బహ్రాయిచ్ విభాగం ఉన్నతీకరణకు ఉద్దేశించిన ప్రాజెక్టు. ఈ రెండు జిల్లాల్లోని వివిధ జనసమ్మర్ద ప్రాంతాల్లో ప్రస్తుతం ఎదురవుతున్న తీవ్ర కోణీయ లోపాలు, పదునైన మలుపులు, రద్దీ వంటి సమస్యలన్నీ ఈ మార్గం నిర్మాణంతో పరిష్కృతం అవుతాయి. అడుగడుగునా సర్వీస్ రోడ్లతో కూడిన ఈ వినియోగ నియంత్రిత 4 వరుసల రహదారి ప్రధాన నివాస ప్రాంతాల మీదుగా వెళ్తూనే, సగటు ప్రయాణ వేగాన్ని పెంచగలదు. అంతేకాకుండా ప్రయాణ సమయాన్ని దాదాపు గంట వరకూ తగ్గిస్తూ- మొత్తం రహదారి భద్రత, ఇంధన సామర్థ్యం, వాహన నిర్వహణ వ్యయాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ప్రాంతీయ రవాణా సహా సామాజిక-ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.
రహదారి విభాగం ఉన్నతీకరణతో ఉత్తరప్రదేశ్‌లోని కీలక ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు నిరంతర అనుసంధానం కలుగుతుంది. అంతేకాకుండా 3 ఆర్థిక, 2 సామాజిక, 12 రవాణా కేంద్రాలను జోడించడం ద్వారా బహుళ రవాణా అనుసంధానాన్ని ఈ నవీకృత కారిడార్ మెరుగుపరుస్తుంది. ఇది రూపైదిహా భూమార్గ ఓడరేవు, విమానాశ్రయాలతో మెరుగైన బహుళ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ, ఈ ప్రాంతమంతటా వస్తు, ప్రయాణిక సత్వర రవాణా సౌలభ్యం కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తితో నేపాల్‌గంజ్ సరిహద్దు ద్వారా భారత్-నేపాల్ మధ్య కీలకమైన సరిహద్దు వాణిజ్య-రవాణా వ్యూహాత్మక కారిడార్ ఏర్పాటవుతుంది. రూపైదిహా భూమార్గ ఓడరేవుకు సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. బహ్రాయిచ్, శ్రావస్తి వంటి మారుమూల జిల్లాలకు అనుసంధానం కూడా దీనితో మెరుగవుతుంది. ఈ ప్రాజెక్టుతో పీఎం గతిశక్తి కార్యక్రమంతోపాటు ఆర్థిక, రవాణా కేంద్రాలకు మద్దతు లభిస్తుంది. వ్యవసాయ వాణిజ్యం, పర్యాటకం, సరిహద్దు వాణిజ్యం, ప్రాంతీయ పెట్టుబడులను కూడా ఇది ప్రోత్సహిస్తుంది.
కారిడార్ మ్యాప్
ప్రాజెక్టు వివరాలు:
స్వరూపం
|
వివరాలు
|
ప్రాజెక్టు పేరు
|
బారాబంకి-బహ్రాయిచ్ మధ్య 4 వరుసల వినియోగ నియంత్రిత జాతీయ రహదారి-927
|
కారిడార్
|
లక్నో-రూపైదిహా
|
పొడవు (కిలోమీటర్లు)
|
101.515
|
మొత్తం వ్యయం (రూ.కోట్లలో)
|
3485.49
|
భూ సేకరణ వ్యయం (రూ.కోట్లలో)
|
1574.85
|
మొత్తం పెట్టుబడి వ్యయం (రూ.కోట్లలో)
|
6969.04
|
విధానం
|
హైబ్రిడ్ యాన్యుటీ విధానం (హెచ్‌ఏఎం)
|
బైపాస్ మార్గాల పొడవు
|
48.28 కిలోమీటర్లు
|
ప్రధాన సంధానిత రోడ్లు
|
జాతీయ రహదారులు.. ఎన్‌హెచ్-27, 330బి, 730
రాష్ట్ర రహదారులు... ఎస్‌హెచ్-13, 30బి
|
సంధానిత ఆర్థిక/సామాజిక/రవాణా కూడళ్లు
|
విమానాశ్రయాలు: లక్నో, శ్రావస్తి
రైల్వే స్టేషన్లు: బారాబంకి, రసౌలి, జంగీరాబాద్, రఫీనగర్, బిందౌరా, బుర్వాల్, చౌకఘాట్, ఘఘ్రాఘాట్, జర్వాల్, బహ్రైచ్
ల్యాండ్ పోర్ట్: రూపై దిహా
ఆర్థిక కూడళ్లు: 01 ఎస్‌ఈజడ్, 02 మెగా ఫుడ్ పార్క్
సామాజిక కూడళ్లు: 02 ఆకాంక్షాత్మక జిల్లాలు
|
సంధానిత ప్రధాన నగరాలు/పట్టణాలు
|
బారాబంకి, రామ్‌నగర్, జర్వాల్, కైసర్‌గంజ్, కుందసర్, ఫఖర్‌పూర్, బహ్రైచ్
|
ఉపాధి సృష్టి సామర్థ్యం
|
36.54 లక్షల (ప్రత్యక్ష) పనిదినాలు... 43.04 లక్షల (ప్రరోక్ష) పనిదినాలు
|
2028లో వార్షిక సగటు రోజువారీ వాహన రాకపోకలు (ఏఏడీటీ)
|
28,557 (ప్యాకేజీ-1), 21,270 (ప్యాకేజీ-2) పాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ)గా అంచనా.
|
****
(రిలీజ్ ఐడి: 2242009)
|