సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రెస్ సేవా వెబ్‌సైట్ ద్వారా ఇకపై ఆన్‌లైన్‌లో అన్ని ప్రెస్ రిజిస్ట్రేషన్ సేవలు


1.5 లక్షలకు పైగా పాత రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి

ప్రెస్ సేవా వెబ్‌సైట్‌లో 780 జిల్లాల అనుసంధానం

రూ. 5 కోట్లకు పైగా జరిమానాలు విధింపు.. 88,315 ప్రచురణల రద్దు

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 5:59PM by PIB Hyderabad

ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియడికల్స్ (పీఆర్‌పీ) చట్టం- 2023 ప్రకారం పత్రికల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే అన్ని దరఖాస్తుల విషయంలో పూర్తి ప్రక్రియను ఇప్పుడు ప్రెస్ సేవా పోర్టల్ ద్వారా డిజిటల్ పద్ధతిలోనే పూర్తి చేస్తున్నారు. దీనికి అనుగుణంగా గతంలో అమలులో ఉండి ఇప్పుడు రద్దు అయిన 1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం (పీఆర్‌బీ) కింద నమోదైన 1.5 లక్షలకు పైగా భౌతిక రికార్డులను డిజిటలైజ్ చేసి ప్రెస్ సేవా పోర్టల్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం కొత్త పత్రికల రిజిస్ట్రేషన్, ఇప్పటికే ఉన్న పత్రికల వివరాల సవరణ, యాజమాన్య మార్పిడి, వార్షిక నివేదికల దాఖలు, ఆన్‌లైన్ జరిమానాల చెల్లింపు, సర్క్యులేషన్ తనిఖీలు వంటి సేవలన్నీ ఈ వెబ్‌సైట్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ చట్టం అమలులో భాగంగా దేశవ్యాప్తంగా 780 జిల్లాల సంబంధిత అధికారులను ప్రెస్ సేవా పోర్టల్‌లో అనుసంధానించారు. 2024 మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 11,081 దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసి సంబంధిత విభాగాలకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు.

ప్రెస్ సేవా వెబ్‌సైట్ ద్వారా విధించిన, చెల్లించిన జరిమానాల వివరణాత్మక జాబితా అనుబంధం-Iలో ఉంది. రద్దు చేసిన పత్రికల సంఖ్యకు సంబంధించిన రాష్ట్రాల వారీ వివరణాత్మక జాబితా అనుబంధం-IIలో ఉంది. వివిధ కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు చూపుతున్న ప్రభావాన్ని ప్రభుత్వం నిరంతరం అంచనా వేస్తోంది. వెబ్‌సైట్ ద్వారా మెరుగైన సేవలను అందించడానికి ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌జీఐ) నిరంతరం అభిప్రాయాలను స్వీకరిస్తూ తగిన చర్యలు చేపడుతోంది.

రిజిస్టర్ అయిన వార్తాపత్రికలు, నియతకాలిక ప్రచురణల జాబితా పీఆర్‌జీఐ అధికారిక వెబ్‌సైట్ https://prgi.gov.in/ లో అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లోని ‘అవర్ సర్వీసెస్’ విభాగంలో ఉన్న ‘రిజిస్టర్డ్ టైటిల్స్’లో ఈ వివరాలను చూడొచ్చు. లోక్‌సభలో శ్రీ దామోదర్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర సమాచార- ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నేడు సమర్పించారు.

 

ప్రెస్ సేవా వెబ్‌సైట్ గురించి 11.03.2026న సమాధానం ఇవ్వాల్సిన లోక్‌సభ నక్షత్ర గుర్తు లేని ప్రశ్న సంఖ్య 3028 సమాధానంలో పేర్కొన్న అనుబంధం-I

27.02.2026 నాటికి ప్రెస్ సేవా వెబ్‌సైట్ ద్వారా విధించిన, చెల్లించిన జరిమానాల వివరాలు

క్ర.సం.

ప్రచురణ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం

మొత్తం జరిమానా (రూ.)

1

కర్ణాటక

52,74,000

2

ఒడిశా

9,20,000

3

తమిళనాడు

44,17,000

4

హర్యానా

4,72,000

5

మహారాష్ట్ర

99,60,000

6

పశ్చిమ బెంగాల్

13,87,000

7

ఢిల్లీ

37,92,000

8

గుజరాత్

37,59,000

9

ఉత్తర ప్రదేశ్

44,08,000

10

ఆంధ్రప్రదేశ్

30,72,000

11

ఛత్తీస్‌గఢ్

8,44,000

12

మధ్యప్రదేశ్

82,84,000

13

కేరళ

17,39,000

14

తెలంగాణ

12,61,000

15

పంజాబ్

8,33,000

16

జమ్మూ కాశ్మీర్

6,63,000

17

రాజస్థాన్

26,77,000

18

ఉత్తరాఖండ్

8,68,000

19

జార్ఖండ్

2,02,000

20

బీహార్

5,09,000

21

హిమాచల్ ప్రదేశ్

1,12,000

22

త్రిపుర

1,42,000

23

చండీగఢ్

1,50,000

24

అండమాన్, నికోబార్ దీవులు

18,000

25

అస్సాం

2,55,000

26

నాగాలాండ్

9,000

27

సిక్కిం

1,59,000

28

గోవా

33,000

29

మిజోరం

50,000

30

పుదుచ్చేరి

45,000

31

మణిపూర్

51,000

32

దాద్రా నగర్‌ హవేలీ

9,000

33

మేఘాలయ

9,000

34

అరుణాచల్ ప్రదేశ్

0

 

మొత్తం

5,63,83,000

 

ప్రెస్ సేవా వెబ్‌సైట్ గురించి 11.03.2026న సమాధానం ఇవ్వాల్సిన లోక్‌సభ నక్షత్ర గుర్తు లేని ప్రశ్న సంఖ్య 3028 సమాధానంలో పేర్కొన్న అనుబంధం-II

రద్దు చేసిన ప్రచురణల సంఖ్యకు సంబంధించిన రాష్ట్రాల వారీ వివరాలు

క్ర.సం.

ప్రచురణ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం

రద్దైన సంఖ్య

1

అండమాన్, నికోబార్ దీవులు

69

2

ఆంధ్రప్రదేశ్

2485

3

అరుణాచల్ ప్రదేశ్

12

4

అస్సాం

612

5

బీహార్

1703

6

చండీగఢ్

534

7

ఛత్తీస్‌గఢ్

817

8

దాద్రా నగర్‌ హవేలీ

5

9

ఢిల్లీ

11920

10

గోవా

131

11

గుజరాత్

3539

12

హర్యానా

1854

13

హిమాచల్ ప్రదేశ్

289

14

జమ్మూ కాశ్మీర్

582

15

జార్ఖండ్

325

16

కర్ణాటక

5059

17

కేరళ

3541

18

లక్షద్వీప్

7

19

మధ్యప్రదేశ్

4806

20

మహారాష్ట్ర

12403

21

మణిపూర్

226

22

మేఘాలయ

87

23

మిజోరం

163

24

నాగాలాండ్

17

25

ఒడిశా

1723

26

పుదుచ్చేరి

125

27

పంజాబ్

2481

28

రాజస్థాన్

4851

29

సిక్కిం

51

30

తమిళనాడు

 


(రిలీజ్ ఐడి: 2238636) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Odia , Tamil , Malayalam