ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్, హర్యానా మధ్య ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (ఢిల్లీ-ఫరీదాబాద్-బల్లభ్‌గఢ్-సోహ్నా అనుసంధాన రహదారి) నుంచి జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణానికి సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2026 4:29PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఉత్తరప్రదేశ్హర్యానా మధ్య ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (ఢిల్లీ-ఫరీదాబాద్-బల్లభ్‌గఢ్-సోహ్నా అనుసంధాన రహదారినుంచి జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణం కోసం సవరించిన అంచనా వ్యయం రూ.3630.77 కోట్లకు ఆమోదం లభించింది.

31.42 కి.మీపొడవైన ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ ఢిల్లీఫరీదాబాద్గురుగ్రామ్ నుంచి జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగావేగంగా వెళ్లేందుకు వీలుంటుందిఇది జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్ఆర్థిక వృద్ధినిరవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఈ కారిడార్ తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేయమునా ఎక్స్‌ప్రెస్‌వేప్రత్యేక సరకు రవాణా కారిడార్ (డీఎఫ్‌సీ)లను అనుసంధానించివివిధ రవాణా వ్యవస్థల కలయికకు వేదికగా నిలుస్తుందిఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపరమైన మెరుగుదల మాత్రమే కాక.. పట్టణ ప్రాంతంలో విప్లవాత్మక మార్పులకుప్రాంతీయ అనుసంధానానికిజాతీయ రవాణా సామర్థ్యానికి వ్యూహాత్మకంగా నిలుస్తుందిజెవార్ విమానాశ్రయం-ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయటానికిఫరీదాబాద్‌లో స్థిరమైన పట్టణాభివృద్ధికి దీని నిర్మాణం అత్యంత కీలకం.

ఈ ప్రాజెక్టులో 11 కి.మీ వరకు ఎలివేటెడ్ హైవేను అభివృద్ధి చేస్తారుఇది డీఎన్‌డీ-బల్లభ్‌గఢ్ బైపాస్జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీలో కీలక భాగంఈ మార్గం విమానాశ్రయాన్ని ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానిస్తుందిఈ కారిడార్ ఫరీదాబాద్ మాస్టర్ ప్లాన్-2031 ప్రకారం అత్యధిక జనసాంద్రత గల పట్టణాభివృద్ధికిభవిష్యత్ మౌలిక సదుపాయాల విస్తరణకు కేటాయించిన ప్రాంతం నుంచి వెళుతుందిప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అయ్యే అదనపు వ్యయం రూ.689.24 కోట్లు కాగారూ.450 కోట్లు వెచ్చించేందుకు హర్యానా ప్రభుత్వం అంగీకరించింది.

 

ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (ఢిల్లీ-ఫరీదాబాద్-బల్లభ్‌గఢ్-సోహ్నా అనుసంధాన రహదారినుంచి జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ మ్యాప్

***


(రిలీజ్ ఐడి: 2237702) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam