ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోటా విమానాశ్రయ శంకుస్థాపన సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 7:12PM by PIB Hyderabad

కోటా విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమంలో తన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘ఓం బిర్లా గారు ఎంత అద్భుతమైన పార్లమెంట్ సభ్యుడో, అంతే నిపుణులైన లోక్‌సభ స్పీకర్‌ కూడా. విద్యకు పేరుగాంచిన నగరం నుంచి వచ్చిన ఫలితంగా ఆయన సభను మంచి నాయకుడిలా నిర్వహిస్తున్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఆయన అధికార పక్షం, విపక్షాలు అనే తేడాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరి పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉంటారు.

@ombirlakota’’

‘‘కోటాలో విమానాశ్రయ అభివృద్ధి కోసం లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. కోటా పురోగతి కోసం ఆయన పడుతున్న తపన అందరికీ కనిపిస్తూనే ఉంది.

శ్రీ ఓం బిర్లా ఎంతటి అద్భుతమైన పార్లమెంటు సభ్యుడో, అంతటి నిపుణులైన లోక్‌సభ స్పీకర్ కూడా. బహుశా విద్యకు పేరుగాంచిన నగరం (కోటా) నుంచి రావడం వల్లనేమో, ఆయన సభలో అందరినీ కలుపుకుంటూ ఎంతో అద్భుతంగా సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలకతీతంగా ఆయన పార్లమెంటు సభ్యులందరినీ ఎంతో గౌరవంతో ఆదరిస్తారు.

@ombirlakota’’


(రిలీజ్ ఐడి: 2236638) సందర్శకుల సూచీ సంఖ్య : : 6