ప్రధాన మంత్రి కార్యాలయం
జన్ ఔషధీ దినోత్సవం - 2026 సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన విప్లవాత్మక మార్పులను తెచ్చిందన్న ప్రధాని
प्रविष्टि तिथि:
07 MAR 2026 10:15AM by PIB Hyderabad
ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరికీ.. జన్ ఔషధీ దినోత్సవం- 2026 సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన ఔషధాలు అందుబాటు ధరలకే ప్రతి పౌరుడికీ అందేలా చూడాలన్న తమ అంకితభావానికి ఈ కార్యక్రమం నిదర్శనమని శ్రీ మోదీ పేర్కొన్నారు. జన్ ఔషధీ కేంద్రాల ద్వారా ఎన్నో కుటుంబాలు తమ ఆరోగ్య రక్షణ ఖర్చులను ఆదా చేసుకుంటూ, సరైన చికిత్స పొందుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన ద్వారా ప్రజల జీవితాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులకు సంబంధించి.. మచ్చుతునకలుగా నిలిచే కొన్ని విశేషాలను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరికీ.. #JanAushadhiDiwas2026 సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి పౌరుడికీ తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలను అందుబాటులోకి తేవాలన్న మా సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనం. జన్ ఔషధీ కేంద్రాల ద్వారా.. ఎన్నో కుటుంబాలు ఆరోగ్య రక్షణ ఖర్చులను ఆదా చేసుకోవడంతోపాటు, సరైన చికిత్సను పొందుతున్నాయి”.
“ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతిబింబించే కొన్ని విశేషాల సమాహారమిది.
#JanAushadhiDiwas2026”
(रिलीज़ आईडी: 2236308)
आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil