|
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
యువ సంగమ్ (ఆరో దశ)కు 2026 మార్చి నెల 2 నుంచి మొదలవనున్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
దేశంలో వివిధ ప్రాంతాల యువత పాలుపంచుకోవాలని కోరిన విద్యా మంత్రిత్వ శాఖ ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’లో భాగంగా యువజన మార్పిడి కార్యక్రమానికి నేతృత్వం వహించనున్న 22 ఉన్నత విద్యాసంస్థలు
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 5:35PM by PIB Hyderabad
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఈబీఎస్‌బీ) కార్యక్రమంలో భాగంగా యువ సంగమ్-ఆరో దశ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను విద్యామంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రారంభించింది.
‘‘యువ సంగమ్’’ కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్య విభాగం అమలుచేస్తున్న యువ మార్పిడి కార్యక్రమాల్లో ఒక ప్రధాన కార్యక్రమం. వేరు వేరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువతీయువకుల్లో భావనాత్మక సంబంధాలను పటిష్ఠపరచడంతో పాటు పరస్పర అవగాహనను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ధ్యేయం. ఈ కార్యక్రమం జతగా పేర్కొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ప్రణాళికబద్ధమైన అనుభవాన్ని ఇచ్చే యాత్రల ద్వారా ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ భావనను పెంపొందిస్తుంది.
ఆసక్తి ఉన్న, 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల, ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్‌వైకేఎస్ వాలంటీర్లు, యువ వృత్తినిపుణులు సహా యువత అధికారిక పోర్టల్ https://ebsb.aicte-india.org లో, లేదా https://ekbharat.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చును.
ఇదివరకు యువ సంగమ్ అయిదో దశలో చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నమోదైంది. దానిలో దేశవ్యాప్తంగా 46,000 కన్నా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అందాయి. దీనిని ఆరంభించినప్పటి నుంచి చూసుకొంటే, 6,000 కన్నా ఎక్కువ మంది యువతీయువకులు, సమన్వయకర్తలు యువ సంగమ్ వివిధ దశలలో (2022 లో నిర్వహించిన ప్రయోగాత్మక దశను కలుపుకొని) విస్తృత యాత్రల్లో పాల్గొన్నారు. ఈ యాత్రలను దేశవ్యాప్తంగా ప్రధాన ఉన్నత విద్యాసంస్థలు చేపట్టాయి. ఇది అనుభవపూర్వక శిక్షణ పట్ల, జాతీయ సమైక్యత పట్ల నానాటికీ పెరుగుతున్న ఉత్సాహానికి అద్దం పడుతోంది.
యువ సంగమ్ ఆరో దశలో, దేశం నలుమూలలా నోడల్ సంస్థలుగా 22 ఉన్నత విద్యాసంస్థలను (హెచ్ఈఐస్) గుర్తించారు. యాత్రలో పాల్గొనడానికి ఎంపిక చేసిన అభ్యర్థులు తమకు సంబంధించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అయిదు రోజుల నుంచి ఏడు రోజుల పాటు (ప్రయాణ దినాలు కలపకుండా) విద్యా, సాంస్కృతిక యాత్రలు చేస్తారు.
ఈ కార్యక్రమాన్ని అయిదు ప్రధాన ఇతివృత్తాలతో రూపొందించారు. ఈ ఇతివృత్తాల్లో.. 1.పర్యటన, 2.పరంపర (సంప్రదాయాలు, సంస్కృతి), 3.ప్రగతి (అభివృద్ధి, పాలన), 4.పరస్పర సంపర్కం (ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరుచుకోవడం), 5.ప్రొద్యోగికీ (సాంకేతికత, నవకల్పన) భాగంగా ఉన్నాయి.
యాత్రలో పాల్గొనే వారు ఈ ఇతివృత్తాల ద్వారా జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)-2020 ఉద్దేశాలకు అనుగుణంగా సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక ప్రగతి, స్థానిక సముదాయాలు, విద్యాసంస్థలతో ముఖాముఖి పరిచయాన్ని ఏర్పరుచుకొంటారు. యువ సంగమ్‌ను దీనిలో పాలుపంచుకొనే మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నోడల్ ఉన్నత విద్యాసంస్థల (హెచ్ఈఐస్) సహకారంతో ‘‘సంపూర్ణ ప్రభుత్వ’’ దృక్పథంతో అమలు చేస్తారు.
యువ సంగమ్ ఆరో దశ కోసం జతలుగా పేర్కొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఉన్నత విద్యా సంస్థలు
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/ కేంద్ర
పాలిత ప్రాంతం
(పంపేది)
|
సంస్థ పేరు
|
జతగా ఏర్పరిచిన
రాష్ట్రం/కేంద్ర
పాలిత ప్రాంతం
(అందుకొనేది)
|
జతపరిచిన
సంస్థ పేరు
|
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
ఐఐటీ తిరుపతి
|
మహారాష్ట్ర
|
ఐఐఎస్ఈఆర్ పుణె
|
|
2
|
ఢిల్లీ
|
ఐఐటీ ఢిల్లీ
|
ఛత్తీస్‌గఢ్
|
ఐఐటీ భిలాయి
|
|
3
|
కర్నాటక
|
ఐఐఐటీ ధార్వాడ
|
రాజస్థాన్
|
ఎంఎన్ఐటీ జైపూర్
|
|
4
|
పంజాబ్
|
ఐఐటీ రోపార్
|
బీహార్
|
ఐఐటీ పాట్నా
|
|
5
|
జమ్మూ, కాశ్మీర్ &
లడఖ్
|
ఐఐఎమ్ జమ్మూ
|
కేరళ & లక్షద్వీప్
|
ఐఐఎమ్ కోజికోడ్
|
|
6
|
మేఘాలయ
|
ఐఐఎమ్ షిల్లాంగ్
|
తెలంగాణ
|
ఎన్ఐటీ వరంగల్
|
|
7
|
మధ్యప్రదేశ్
|
ఐఐటీ ఇండోర్
|
జార్ఖండ్
|
ఐఐటీ ధన్‌బాద్
|
|
8
|
హిమాచల్
ప్రదేశ్
|
హిమాచల్ ప్రదేశ్
కేంద్రీయ విశ్వవిద్యాలయ
|
పుదుచ్చేరి
|
ఎన్ఐటీ పుదుచ్చేరి
|
|
9
|
అరుణాచల్
ప్రదేశ్
|
ఎన్ఈఆర్ఐఎస్‌టీ
|
ఉత్తరప్రదేశ్
|
ఐఐఎమ్ లక్నో
|
|
10
|
హర్యానా
|
ఎన్ఐటీ కురుక్షేత్ర
|
త్రిపుర
|
ఎన్ఐటీ అగర్తల
|
|
11
|
గుజరాత్ & దాద్రా నాగర్ హవేలీ
& డామన్ డయ్యూ
|
ఐఐఎమ్ అహ్మదాబాద్
|
ఒడిశా
|
ఎన్ఐటీ రూర్కెలా
|
***
(రిలీజ్ ఐడి: 2234927)
|