ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జోర్డాన్ రాజుతో మాట్లాడిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2026 9:45PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా IIతో మాట్లాడారు.

ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల పట్ల ప్రధానమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జోర్డాన్ ప్రజల శాంతి, భద్రత, సంక్షేమానికి తమ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ క్లిష్ట సమయంలో జోర్డాన్‌లోని భారతీయుల క్షేమం పట్ల జాగ్రత్త తీసుకుంటున్నందుకు జోర్డాన్ రాజుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

"జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో మాట్లాడాను. ఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల పట్ల మా తీవ్ర ఆందోళనన తెలియజేశాను. జోర్డాన్ ప్రజల శాంతి, భద్రత, సంక్షేమానికి మా మద్దతును పునరుద్ఘాటించడంతో పాటు ఈ క్లిష్ట సమయంలో అక్కడి భారతీయులను జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2234810) సందర్శకుల సూచీ సంఖ్య : : 95