మంత్రిమండలి
పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
01 MAR 2026 11:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రత అంశాల మంత్రివర్గ సంఘం (సీసీఎస్) ఈ రోజున సమావేశమైంది. పశ్చిమాసియాలో మారుతున్న స్థితిని ఈ సమావేశంలో సమీక్షించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై గగనతల దాడులు, ఆ తరువాత గల్ఫ్ లోని అనేక దేశాలపై దాడులతో ఉద్రిక్త స్థితి చోటు చేసుకోవడానికి సంబంధించిన సమాచారాన్ని సమావేశంలో సీసీఎస్ దృష్టికి తీసుకు వచ్చారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయ ప్రవాసుల భద్రత పట్ల సీసీఎస్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.
ఆ ప్రాంతం మీదుగా ప్రయాణాలు జరుపుతున్న భారతీయ యాత్రికులతో పాటు నిర్ధారిత పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను సీసీఎస్ సమీక్షించింది. ప్రాంతీయ భద్రతతో పాటు ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలపై కలిగే విస్తృత ప్రభావాలను కూడా సమీక్షించారు.
ఈ పరిణామాలతో ప్రభావితమయ్యే భారతీయ పౌరులకు సాయపడటం కోసం అవసరమైన అన్ని చర్యలనూ యథాశక్తిగా చేపట్టవలసిందంటూ సంబంధిత అన్ని విభాగాలకు సీసీఎస్ ఆదేశాలు ఇచ్చింది. వైరాలకు త్వరగా స్వస్తి పలకడానికీ, చర్చలతో పాటు దౌత్య మార్గాన్ని అనుసరించడానికీ ప్రాధాన్యాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది.
****
(रिलीज़ आईडी: 2234662)
आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam