ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానిని కలిసిన విఖ్యాత మలయాళీ సాహితీవేత్తలు... రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చినందుకు కృతజ్ఞతలు
प्रविष्टि तिथि:
27 FEB 2026 7:34PM by PIB Hyderabad
కేరళ పేరును కేరళంగా మార్చడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ మలయాళీ సాహితీవేత్తల బృందం ఈ రోజు ప్రధానమంత్రిని కలిసింది.
ప్రముఖ మలయాళ సాహితీవేత్తలను కలవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందనీ, వారితో చర్చలు అత్యంత జ్ఞానదాయకంగా సాగాయనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా కేరళం రాష్ట్రం పట్ల, మలయాళ భాష పట్ల వారి మమకారానికీ, అంకితభావానికీ ఈ సమావేశం అద్దం పట్టిందంటూ కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘కేరళ పేరును కేరళంగా మార్చడం పట్ల కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖ మలయాళ సాహితీవేత్తల బృందానికి స్వాగతం పలకడం సంతోషాన్నిస్తోంది. వారితో చర్చలు అత్యంత జ్ఞానదాయకంగా సాగాయి. కేరళం రాష్ట్రం పట్ల, మలయాళ భాష పట్ల వారి మమకారానికి, అంకితభావానికి ఈ సమావేశం అద్దం పట్టింది.
***
(रिलीज़ आईडी: 2233783)
आगंतुक पटल : 76
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam