ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

"వికసిత్ భారత్ కోసం సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక సాయం" అంశంపై ఫిబ్రవరి 27న పోస్ట్‌ బడ్జెట్ వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న పీఎం


కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించిన ముఖ్యమైన అంశాల ఆధారంగా నిర్వహిస్తున్న పోస్ట్‌ బడ్జెట్ వెబినార్లలో మొదటిది ఇది

प्रविष्टि तिथि: 26 FEB 2026 8:07PM by PIB Hyderabad

"వికసిత్ భారత్ కోసం సాంకేతికతసంస్కరణలుఆర్థిక సాయంఅంశంపై ఫిబ్రవరి 27న ఉదయం 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోస్ట్‌ బడ్జెట్ వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారుఈ వెబినార్‌లో పబ్లిక్ క్యాపెక్స్మౌలిక సదుపాయాలుబ్యాంకింగ్ రంగ సంస్కరణలుఆర్థిక రంగ నిర్మాణంమూలధన మార్కెట్ల విస్తృతిపన్ను సంస్కరణల ద్వారా జీవన సౌలభ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి.

 

కేంద్ర బడ్జెట్‌ 2026-27లో ప్రస్తావించిన ముఖ్యమైన అంశాల ఆధారంగా నిర్వహిస్తున్న పోస్ట్‌ బడ్జెట్ వెబినార్లలో మొదటిది ఇదిగత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటంవివిధ భాగస్వాముల ఆచరణాత్మక అనుభవాలువిశ్లేషణాత్మక అభిప్రాయాల ఆధారంగా బడ్జెట్ ప్రకటనలను బలోపేతం చేయటం ఈ వెబినార్ల ప్రధాన ఉద్దేశంతద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లక్ష్యాలను ఫలితాల ఆధారంగా సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన నిర్మాణాత్మక అభిప్రాయాల సేకరణ జరుగుతుందికీలకమైన బడ్జెట్ ప్రకటనల సమర్థ అమలు మార్గాలపై చర్చించటానికి పరిశ్రమల ప్రతినిధులుఆర్థిక సంస్థలుమార్కెట్ భాగస్వాములుప్రభుత్వంపరిశ్రమల నియంత్రణ సంస్థలువిద్యావేత్తలకు ఈ వెబినార్ వేదిక కానుంది.

 

***


(रिलीज़ आईडी: 2233339) आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , Tamil , Assamese , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati