ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
2026-27 సీజన్‌కు ముడి జనపనారకు కనీస మద్దతు ధరలకు కేబినెట్ ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 3:37PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. 2026-27 మార్కెటింగ్ సీజనుకు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరలకు ఈ రోజు ఆమోదం తెలిపింది.
2026-27 సీజనుకు గాను ముడి జనపనార (టీడీ-3 గ్రేడ్) కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 5,925/- గా నిర్ణయించింది. ఇది అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయంపై 61.8 శాతం లాభాన్ని అందిస్తుంది. భారత ప్రభుత్వం 2018-19 బడ్జెటులో ప్రకటించిన మేరకు- అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు కనీస మద్దతు ధర ఉండాలన్న సూత్రానికి అనుగుణంగా.. 2026-27 మార్కెటింగ్ సీజనుకు సంబంధించి ముడి జనపనారకు ఎంఎస్పీని నిర్ణయించారు.
గత 2025-26 సీజనుతో పోలిస్తే.. 2026-27 మార్కెటింగ్ సీజనుకు ప్రకటించిన ముడి జనపనార కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 275/- పెరిగింది. ముడి జనపనార కనీస మద్దతు ధర 2014-15లో క్వింటాలుకు రూ. 2,400/- ఉండగా, 2026-27 నాటికి ప్రభుత్వం దానిని రూ. 5,925/- కు పెంచింది. అంటే క్వింటాలుకు రూ. 3,525/- (2.5 రెట్లు) పెరుగుదల నమోదైంది.
2014-15 నుంచి 2025-26 వరకు జనపనార రైతులకు చెల్లించిన కనీస మద్దతు ధర రూ. 1342 కోట్లు. కాగా 2004-05 నుంచి 2013-14 వరకు చెల్లించిన మొత్తం రూ. 441 కోట్లు మాత్రమే.
ధరల మద్దతు కార్యకలాపాలను చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థగా భారత జనపనార కార్పొరేషన్ (జేసీఐ) కొనసాగుతుంది. ఆ కార్యకలాపాల్లో ఏదైనా నష్టం వాటిల్లితే.. ఆ మొత్తాన్నీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తిరిగి చెల్లిస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2232259)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
Malayalam
,
Marathi
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Punjabi
,
Gujarati
,
Kannada