ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 22 FEB 2026 6:53PM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై

భారత్ మాతాకీ జై

భారత్ మాతాకీ జై

గౌరవ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కేంద్రమంత్రి వర్గ సహచరులు పంకజ్ చౌదరిజయంతి చౌదరిఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్యూపీ ప్రభుత్వ మంత్రులుతోటి పార్లమెంటు సభ్యులుశాసనసభ్యులుపెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రియమైన సోదరీసోదరులారా!

బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమివిప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోందితొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలుమెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయిఅభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణనగరంలో ప్రయాణించేందుకు మెట్రోజంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయిఅభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.

సోదరీసోదరులారా,

నేటి కార్యక్రమం బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరుని ప్రతిబింబిస్తుందిమన పని సంస్కృతి ఏంటిఏదైనా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాతదాన్ని పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తాంఅందువల్ల గతంలో లాగా ప్రాజెక్టులు నిలిచిపోవటంఆలస్యం వంటివి ఇప్పుడు జరగటం లేదునమో భారత్మెట్రో సర్వీసు రెండింటిని గతంలో నేనే ప్రారంభించానుఈ రోజు వాటిని దేశానికి అంకితం చేసే భాగ్యం నాకు కలిగింది.

మిత్రులారా,

కొద్దిసేపటి కిందట నేను మీరట్ మెట్రోలో ప్రయాణించానుఆ సమయంలో చాలామంది యువ విద్యార్థులుఇతర ప్రయాణికులతో నేను ముచ్చటించానుఇలాంటి అద్భుతమైన సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వారు ఎప్పుడూ ఊహించలేదని చెప్పారుగత రోజులను వారు గుర్తు చేసుకున్నారుముఖ్యంగా మహిళలుకుమార్తెలు ఇలా చెప్పారుకొన్నేళ్ల కిందటి వరకు సాయంత్రం ఈ మార్గం నిశ్శబ్దంభయంతో నిండిపోయేదన్నారుఇప్పుడు ఒకవైపు శాంతిభద్రతలు మెరుగుపడగామరోవైపు ప్రజలకు సురక్షితమైనసౌకర్యవంతమైన ప్రయాణమార్గం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

మిత్రులారా,

మహిళా సాధికారతకు చిహ్నంగా నమో భారత్ రాపిడ్ రైల్ మారటం నాకు ఆనందంగా ఉందిరైలు ఆపరేటర్లుగాస్టేషన్ నియంత్రణ సిబ్బందిగాఅనేక కీలక బాధ్యతల్లో మన కుమార్తెలు ముందుండి సేవలను నడిపిస్తున్నారుదేశంలోనే మొదటి నమో భారత్ రాపిడ్ రైల్ సర్వీస్మీరట్ మెట్రో ప్రారంభమైన సందర్భంగా మీ అందరికీఉత్తరప్రదేశ్ఢిల్లీ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

నాకు మీరట్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2014, 2019 ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలను మీరట్ నుంచే ప్రారంభించానుమీరట్ ప్రజలురైతులుపారిశ్రామికవేత్తలుచిన్న తరహా పరిశ్రమల కార్మికులుచేతివృత్తుల వారువ్యాపారులు ఎల్లప్పుడూ నాకు ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు.

మిత్రులారా,

విషపూరిత రాజకీయాలను వీడిఅభివృద్ధి విషయంలో పోటీ పడమని కాంగ్రెస్ఎస్పీ-బీఎస్పీలకు నేను చెప్పాను.

మిత్రులారా,

ఆ పార్టీలు విషపూరిత రాజకీయాలను మానుకోలేదుకానీ.. విధానాల్లోపనితీరులోఉద్దేశంలో బీజేపీ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిందిఅందుకు మీరట్ మెట్రోనే నిదర్శనం.

మిత్రులారా,

2014కు ముందు భారత్‌లో మెట్రో సేవల విస్తరణ నెమ్మదిగా సాగిందికాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం నగరాల్లో మాత్రమే మెట్రో రైలు సర్వీసు ఉండేదిబీజేపీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా 25కి పైగా నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయిప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా భారత్ అవతరించిందిఉత్తరప్రదేశ్‌లో కూడా మీరట్ సహా మరికొన్ని నగరాల్లో మెట్రో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మిత్రులారా,

11 ఏళ్లలో డజన్ల కొద్దీ నగరాలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయిప్రజలకు సౌకర్యవంతమైన రవాణాను అందించాలనిట్రాఫిక్ జామ్కాలుష్యం లేని అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని పౌరులకు కల్పించాలనేది బీజేపీ ప్రభుత్వ సంకల్పంకాబట్టేఇవాళ నమో భారత్ వంటి ఆధునిక సెమీ హై-స్పీడ్ రైళ్లువందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

మిత్రులారా,

ఢిల్లీలో కాంగ్రెస్ఎస్పీ ప్రభుత్వం ఉన్నప్పుడుఇవి సాధ్యం కాలేదుఆ సమయంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కుంభకోణాల్లో చిక్కుకున్నాయిచివరికి మెట్రో వ్యవస్థకు సంబంధించిన సాంకేతికతను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందిఆ కుంభకోణాలకు మేం అడ్డుకట్ట వేసిదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించాంఎందుకంటే దేశాభివృద్ధిప్రజల సౌలభ్యంసుసంపన్నతే బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యతమీరట్పశ్చిమ యూపీ ప్రజల జీవితాలు ఎంతగా మారాయో ఒకసారి చూడండిసరాయ్ కాలే ఖాన్ఆనంద్ విహార్ఘజియాబాద్మీరట్‌లోని రైల్వేమెట్రో స్టేషన్లుబస్ టెర్మినళ్లను అనుసంధానం చేశారుదేశంలోనే మొదటిసారిగా నమో భారత్మెట్రో రైలు.. ఒకే స్టేషన్ నుంచిఒకే ట్రాక్‌పై పరుగులు పెట్టనున్నాయిదీనివల్ల మీరు ఒకే ప్లాట్‌ఫామ్ నుంచి నగరంలో ప్రయాణించటమే కాకఅదే స్టేషన్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకోవచ్చుచదువులుఉద్యోగాలుఇతర పనుల కోసం రోజూ మీరట్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వేలమంది ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందిఢిల్లీలో పనిచేస్తూ మీరట్‌లో నివసించేవారు.. ఇకపై ఢిల్లీలో అద్దె ఇళ్లలో ఉండాల్సిన పనిలేదు.

మిత్రులారా,

ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు నేడు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోందిఇది మీ డబ్బుని ఆదా చేయటమే కాకయువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తుందిపశ్చిమ యూపీలో చూడండినూతన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంసరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్ల అభివృద్ధి జరుగుతోందిజెవార్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోందిఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఉపాధి అవకాశాలుంటాయితర్వాత కొత్త పరిశ్రమలువాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమం అవటంతో మరిన్ని ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉంటుంది.

మిత్రులారా,

శ్రమకుసృజనాత్మకతకు నిలయం ఉత్తరప్రదేశ్ఇక్కడి రైతులుపశుపోషకులుచిన్న తరహా పారిశ్రామికవేత్తలుచేనేత కార్మికులుచేతివృత్తుల వారందరూ వారసత్వఅభివృద్ధి మంత్రాన్ని సాకారం చేస్తున్నారుభారతదేశం శక్తిమంతంగా ఎదిగినప్పుడుఉత్తరప్రదేశ్‌లోని ఈ శ్రమజీవులందరూ ఆ ప్రయోజనాలను పొందవచ్చు.

మిత్రులారా,

ఇటీవల కాలంలో భారత్‌పై ప్రపంచానికి ఎంత నమ్మకం కుదిరిందోప్రజలు ఎంత ఆశావహ దృక్పథంతో ఉన్నారో మీరు చూడవచ్చుఅభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయిగతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నాఅభివృద్ధి చెందిన దేశాలతో ఇలాంటి ఒప్పందాలు జరిగేవి కాదుఅప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ముద్రకుంభకోణాల కారణంగా భారత్‌తో లావాదేవీలకు ప్రపంచదేశాలు వెనుకాడేవికానీ నేడు అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌తో భాగస్వామ్యానికి ఆసక్తి కనబరుస్తున్నాయిభారతదేశ అభివృద్ధిలో భవిష్యత్తును చూసుకుంటున్నాయిభారత యువశక్తిపై నమ్మకంతో ఉన్నాయి. 21వ శతాబ్దపు సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే శక్తి భారతదేశమని ప్రపంచం బలంగా విశ్వసిస్తుంది.

మిత్రులారా,

ఇటీవల సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు సూక్ష్మచిన్నకుటీర పరిశ్రమలకు గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తాయిదీనివల్ల మీరట్‌లో క్రీడా సామాగ్రికత్తెరల తయారీదారులుఖుర్జా పాత్రలుమొరాదాబాద్ ఇత్తడి సామాగ్రిబాఘ్‌పత్ గృహోపకరణాలుసహరన్‌పూర్ చెక్క కళ.. తోలువస్త్రనగల సంబంధిత పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందిచిన్నకుటీర పరిశ్రమలన్నీ అపారమైన ప్రయోజనాన్ని పొందుతాయిభారతదేశంలోని చిన్నపెద్ద నగరాల శక్తిని ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి చేరవేయటంఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల ప్రత్యేక గుర్తింపును పెంపొందించటమే బీజేపీ ప్రాధాన్యత.

మిత్రులారా,

మీరట్ సహా పరిసర ప్రాంతాలన్నీ చిన్న తరహా పరిశ్రమలకుఎంఎస్ఎంఈలకు ప్రధాన కేంద్రాలుఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో చిన్న తరహా పరిశ్రమలకు రూ.1000 కోట్లను ప్రత్యేకంగా కేటాయించాందీనిద్వారా యూపీలోని ఎంఎస్ఎంఈలు సులభంగా రుణాలు పొందవచ్చువస్త్ర పరిశ్రమచేనేత కార్మికుల కోసం మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ యోజనను బడ్జెట్‌లో ప్రకటించాంఖాదీచేనేతహస్తకళల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరుకోవటానికి ఇది దోహదపడుతుంది.

మిత్రులారా,

ఇదివరకుచిన్న తరహా చేతివృత్తుల కళాకారులు కొరియర్ ద్వారా రూ.10 లక్షల విలువైన వస్తువులను మాత్రమే పంపేందుకు వీలుండేదిఇప్పుడు ఈ పరిమితిని పూర్తిగా తొలగించారుదీనివల్ల మీరట్యూపీ వ్యాప్తంగా నేత కార్మికులుచిన్నతరహా పారిశ్రామికవేత్తలుఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అమెరికాఐరోపా వంటి దేశాల్లోని వినియోగదారులకు ఉత్పత్తులను సులభంగా పంపవచ్చు.

మిత్రులారా,

మీరట్-హాపూర్ సహా పరిసర ప్రాంతాలు మొదటి నుంచి చౌదరి చరణ్ సింగ్ దార్శనికతకు సాక్యాలుచౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించే భాగ్యం కలగటం మా ప్రభుత్వ అదృష్టంవారి ఆశయాలకు అనుగుణంగా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందిఇందులో భాగంగా ఆహార శుద్ధి రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాంపీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందే నిధులు చిన్న రైతులకు మేలు చేకూరుస్తున్నాయిఈ పథకం ద్వారా యూపీ రైతులకు ఇప్పటివరకు సుమారు రూ.95,000 కోట్లు అందాయికేవలం మీరట్ రైతులకే దాదాపు రూ.800 కోట్లను అందించాం.

సోదరీసోదరులారా,

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు అహర్నిశలు శ్రమిస్తుంటేకొన్ని రాజకీయ పార్టీలు ఈ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయిప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సు భారత్ లో జరగటం మీరు చూశారుఈ సదస్సు కోసం 80కి పైగా దేశాల ప్రతినిధులు ఢిల్లీకి వచ్చారుదాదాపు 20 దేశాల అధినేతలు భారత్‌కు విచ్చేశారుదేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఢిల్లీకి చేరుకున్నారుఏ అభివృద్ధి చెందుతున్న దేశంలోనూ ఇంత భారీ సదస్సు ఇదివరకు ఎన్నడూ జరగలేదునేను మీరట్ ప్రజలను అడుగుతున్నానుఈ ఏఐ సదస్సు చూసి మీరు గర్వించారా లేదాగట్టిగా చెప్పండి.. మీరు గర్వపడ్డారా లేదాగర్వంతో తల ఎత్తుకున్నారా లేదాగర్వంతో మీ రొమ్ము విరుచుకు నిలబడ్డారా లేదాఇది భారతదేశం కోసం జరిగిందా లేదాఇది భారత యువత కోసం జరిగిందా లేదాఇది భారతదేశ తలరాతను మార్చటానికి జరిగిందా లేదా? 21వ శతాబ్దంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టటానికి జరిగిందా లేదాదేశమంతా గర్వంతో నిండిపోయిందికానీ.. కాంగ్రెస్ వ్యవస్థ ఏం చేసింది?

మిత్రులారా,

భారతదేశం గర్వించదగిన అంతర్జాతీయ వేదికను నీచసిగ్గుమాలిన రాజకీయాలకు అడ్డాగా కాంగ్రెస్ మార్చిందివిదేశీ ప్రతినిధుల ఎదుట కాంగ్రెస్ నాయకులు బట్టలు విప్పి నిరసన తెలిపారునేను కాంగ్రెస్ నేతలను ఒకటే అడుగుతున్నానురాజకీయంగా మీరు దివాళా తీశారని అందరికీ తెలిసినప్పుడుమళ్లీ బట్టలు విప్పి నిరసన చేయాల్సిన అవసరం ఏముందిదేశంలోనే పురాతన పార్టీ సిద్ధాంతపరంగా ఎంత పతనమైందోఎంతటి దారిద్ర్యంలో ఉందో వారి ప్రవర్తన స్పష్టం చేస్తుంది.

మిత్రులారా,

ఎవరూ దీన్ని ఊహించలేరుఒక గ్రామంలో పెళ్లి జరిగితేఆ ఊరంతా ఏకమై వేడుకను విజయవంతం చేసే సంస్కృతి మనదిఎందుకంటే అతిథులు సంతృప్తిగా తిరిగివెళ్లినప్పుడే గ్రామానికి మంచి పేరు వస్తుందనుకుంటాంకానీకాంగ్రెస్ మాత్రం దేశ పరువుని తీయటంలో నిమగ్నమైంది.

మిత్రులారా,

కాంగ్రెస్ నాయకులకు మోదీ అంటే గిట్టదునేను భూస్థాపితం కావాలని వారు కోరుకుంటారునా తల్లిని అవమానించేందుకు కూడా వెనుకాడరుబీజేపీనిఎన్డీయేని వ్యతిరేకిస్తారువారి రాజకీయాలకు అదే అవసరమైతే.. దాన్ని మేం అర్థం చేసుకోగలంభరించగలంకానీఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదనిఅక్కడ బీజేపీ నాయకులు లేరని కాంగ్రెస్ గుర్తుంచుకోవాల్సిందిఅది దేశం గర్వపడే జాతీయ కార్యక్రమంప్రజలు చిందించిన చెమటతో ఏర్పాటు చేసిన వేదికఅయినాకాంగ్రెస్ హద్దులు దాటి ప్రవర్తించిందికాంగ్రెస్ తీరుని దేశమంతా ఖండిస్తోందిదేశాన్ని అవమానించిన వారిని చూసి సిగ్గుపడాల్సింది పోయిదురదృష్టవశాత్తు పాత పార్టీ నాయకులువారిని ఉత్సాహపరుస్తున్నారుమొదట్నుంచి కాంగ్రెస్ తీరు ఇలానే ఉందివాళ్లు పార్లమెంటులో ఏం చేశారో చూడండివాళ్లు సరిగ్గా పనిచేయకపోవటమే కాకమిత్రపక్షాలను కూడా మాట్లాడనివ్వరుపార్లమెంటు సమావేశాలను సాగనివ్వరుదీనివల్ల నష్టపోయేది కాంగ్రెస్ మిత్రపక్షాలేఈ విషయం వారికి కూడా అర్థమవుతోందిఢిల్లీలో కాంగ్రెస్ చేసిన సిగ్గుమాలిన చర్య వల్ల మిత్రపక్షాలన్నీ ఇబ్బందిపడ్డాయిఇప్పుడు వారంతా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు.

దేశంలోని మీడియాకు నాదొక విన్నపంమీడియా నుంచి ఎదురయ్యే వాటిని తట్టుకునే శక్తిని ప్రసాదించమని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానుకానీ ఈరోజు వారిని ఒకటే కోరుతున్నానుమేం విమర్శలు చేసినప్పుడు దయచేసి "మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారువంటి శీర్షికలను పెట్టకండికాంగ్రెస్‌ను కాపాడటానికి ఇలాంటి జిమ్మిక్కులు చేయటం ఆపండిమీరు "విపక్షాలుఅనటం ద్వారా కాంగ్రెస్‌ను కాపాడుతున్నారుదానివల్ల ఇతర ప్రతిపక్ష పార్టీలు నష్టపోతున్నాయిపాపం చేసేది కాంగ్రెస్ అయినా మూల్యం చెల్లించేది ఇతరులుకాంగ్రెస్ వ్యవస్థ ఎప్పుడూ ఇలాగే వ్యవహరిస్తుందితప్పు కాంగ్రెస్సే చేస్తుందివిమర్శలు కాంగ్రెస్ పైనే వస్తాయిఆగ్రహం కాంగ్రెస్‌ పైనే ఉంటుందికానీ మీడియాలో మాత్రం కాంగ్రెస్ పదానికి బదులుగా "విపక్షంఅని మాత్రమే వస్తుందిమీరు కాంగ్రెస్ ని ఎందుకు కాపాడుతున్నారుఇలా చేయటం వల్ల పార్టీని రక్షించలేరు.. పార్టీలో మార్పు తీసుకురాలేరుకాంగ్రెస్ తప్పు చేసిందని మీరు స్పష్టంగా రాయటం మొదలుపెడితేజరగబోయే మార్పును మీరే చూస్తారుఢిల్లీలో టీఎంసీ ఏదైనా తప్పు చేసిందాలేదుడీఎంకే ఏదైనా పాపం చేసిందాలేదుబీఎస్పీ ఏదైనా తప్పు చేసిందాలేదుఫరూక్ అబ్దుల్లా పార్టీ ఏదైనా తప్పు చేసిందాలేదుకేవలం బాధ్యతారహిత్యంతో కాంగ్రెస్ నేతలు మాత్రమే దేశాన్ని నాశనం చేయటానికి సిద్ధమయ్యారుమీరు ప్రధానమంత్రి పదవిని చేపట్టాలనుకుంటేముందుగా ప్రజల మనసులను గెలవాలిమహిళా ఎంపీల ద్వారా బలవంతంగా సీట్లను ఆక్రమించుకున్నంత మాత్రాన ఎవరూ ప్రధానమంత్రి కాలేరుఇలా తల్లులనుఆడబిడ్డలను బలవంతంగా ఎందుకు ముందుకు నెడుతున్నారుఅంతలా దిగజారిపోయారా?

మిత్రులారా,

దేశానికి కాంగ్రెస్ భారంలా మారిందిఢిల్లీలో జరిగిన ఆ ఘటన తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ ఆ పార్టీని విమర్శించినందుకు నాకు తృప్తిగా ఉందినిజందేశ గౌరవం పక్షాన నిలబడినందుకు ప్రతిపక్ష మిత్రపార్టీలకు నేను బహిరంగంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

దేశాభివృద్ధిఉత్తరప్రదేశ్ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవిగుర్తుంచుకోండిపదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్ దేనికి పేరుగాంచిందిమీరట్‌లో అల్లర్లుపశ్చిమ యూపీలో నేరగాళ్ల ముఠాలుఅధ్వాన్నమైన రహదారులువిద్యుత్ కోతలువెనుకబాటుతనం గురించే అందరూ మాట్లాడుకునేవారుపశ్చిమ యూపీలోని నేరాల నేపథ్యంలో సినిమాలను కూడా చిత్రీకరించారుఎస్పీ ప్రభుత్వం యూపీని ఆ స్థాయికి దిగజార్చిందికానీనేడు అభివృద్ధికి మారుపేరుగా యూపీ నిలిచిందిబ్రహ్మోస్ క్షిపణులుఫోన్ల తయారీవిమానాశ్రయాలుపర్యాటక సౌకర్యాల వృద్ధికి యూపీ పేరుగాంచిందిక్రీడా రంగంలోనూ యూపీ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోందిమీరట్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మిత్రులారా,

ఎస్పీ హయాంలో నేరస్తులు నిర్భయంగా తిరిగేవారునేడు యోగీ జీ పాలనలో వారు జైలు పాలవుతున్నారుకళాశాలల నుంచి బయటకు వచ్చే ఆడబిడ్డలను అవమానించే ధైర్యం ఇప్పడు ఎవరికీ లేదు.

మిత్రులారా,

శాంతి భద్రతలు మెరుగుపడినప్పుడు.. వాణిజ్యంవ్యాపారందుకాణాల వృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడుతుందిఅందువల్లే నేడు యూపీ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందియోగీ జీ నాయకత్వంలో దేశంలోనే ప్రధాన తయారీ కేంద్రంగా యూపీ అవతరిస్తోందినిన్న యూపీలో మొదటి సెమీకండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేసే అవకాశం లభించిందిఈ ఫ్యాక్టరీతో యూపీ మరింత శక్తిమంతంగా మారుతుందిఇది నూతన పెట్టుబడులకుకొత్త ఉద్యోగాలకు ఉత్తమ అవకాశాలను కలిగిస్తుందిదేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూపీని మార్చేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నేను హామీ ఇస్తున్నాయూపీ అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందినమో భారత్ రైలుమెట్రో ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మరోసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలుమనం వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను జరుపుకుంటున్నాంనాతో కలిసి అనండి-

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

 

***


(రిలీజ్ ఐడి: 2231893) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam