ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 7:37PM by PIB Hyderabad

ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

బెంగాలీ సాహిత్యంలో ఒక మహోన్నత వ్యక్తిగా శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్  ను కొనియాడుతూప్రజల జీవితాలను ఎంతో సున్నితత్వంతోలోతైన అవగాహనతో చిత్రీకరించిన రచయితగా ప్రధాని ప్రశంసించారు.

“ శంకర్ అని అందరూ ప్రేమగా పిలిచే  శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందిఆయన బెంగాలీ సాహిత్యంలో ఒక మహోన్నత వ్యక్తిఆయన రచనలు ప్రజల జీవితాలను ఎంతో సున్నితత్వంతో,  లోతైన అవగాహనతో ప్రతిబింబించాయిమరువలేని రచనల ద్వారా ఆయన తరతరాల పాఠకులను ప్రభావితం చేయడమే కాకుండా భారత సాహిత్య ప్రపంచాన్ని సుసంపన్నం చేశారుఆయన కుటుంబ సభ్యులకుస్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాఓం శాంతిఅని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్టు చేశారు

 

***


(రిలీజ్ ఐడి: 2231075) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam