ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

కజకిస్థాన్‌ ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 6:34PM by PIB Hyderabad

భారతదేశం నిర్వహిస్తోన్న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో కజకిస్థాన్ ప్రధాన మంత్రి శ్రీ ఓల్షాజ్ బెక్టెనోవ్‌తో సమావేశమయ్యారు. 

సామాజిక శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి కోసం సాంకేతికతను వినియోగించుకోవడంలో ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతూ ఈ సదస్సులో పాల్గొన్నందుకు ప్రధాని బెక్టెనోవ్‌ను మోదీ అభినందించారు. ఈ భేటీలో రాజకీయ, వాణిజ్య, రక్షణ, భద్రత, అనుసంధానత, ఇంధనం, వర్ధమాన సాంకేతికతలు, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

“ప్రధాన మంత్రి ఓల్షాజ్ బెక్టెనోవ్‌, నేను ఈ రోజు ఉదయం సమావేశమయ్యాం. ఆయన పర్యటన భారత్-కజకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వాణిజ్యం, ఇంధనం, కీలక ఖనిజాలు, అరుదైన మూలకాలు, రక్షణ, అనుసంధానత, అంతరిక్ష రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. మన స్నేహాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మేం కలిసి పని చేస్తూనే ఉంటాం.”

 

***


(రిలీజ్ ఐడి: 2230019) సందర్శకుల సూచీ సంఖ్య : : 99