ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ప్రధానమంత్రితో ఎస్టోనియా అధ్యక్షుడి సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 6:16PM by PIB Hyderabad

ఎస్టోనియా అధ్యక్షుడు మాననీయ అలార్‌ కారిస్‌ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భావితరం సాంకేతిక పరిజ్ఞానాలు, ఇంధన నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై నాయకులిద్దరూ ఈ సందర్భంగా చర్చించారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా శ్రీ మోదీ పంపిన సందేశంలో:

“సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ రంగాల్లో విశేష ప్రగతి సాధించిన ఎస్టోనియా దేశాధ్యక్షుడు అలర్ కారిస్‌తో నా చర్చలు ఫలవంతమయ్యాయి. రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి... ముఖ్యంగా చారిత్రక భారత్‌-ఈయూ స్వేచ్ఛా ఒప్పందం నేపథ్యంలో దానికి మరింత ఉత్తేజమివ్వడంపై మేం కూలంకషంగా చర్చించాం. అలాగే భవిష్యత్తరం సాంకేతికతలు, నైపుణ్యం, ఇంధన నిర్వహణ అంశాలపై సంయుక్త కృషి మీద కూడా మేం మాట్లాడుకున్నాం” అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2230015) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Malayalam , Malayalam