సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేదికపై ఏఐ కేంద్రీకృత బృంద చర్చలు, సదస్సులు


ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026 సందర్భంగా.. వేవ్స్ క్రియేటర్స్ కార్నర్‌లో ఏఐ ఆవిష్కరణలను ప్రదర్శించనున్న 51 అంకుర సంస్థలు

ఏఐ ఆధారిత సృజన రంగంలో భారత్ సత్తా చాటేలా.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, అడోబ్ భాగస్వామ్యం

మంత్రిత్వ శాఖ పెవిలియన్ వద్ద మేడిన్ ఇండియా లఘుచిత్రాలు, అధునాతన కంటెంట్ సృజన ప్రక్రియల ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 3:40PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పెవిలియన్‌ వేదికగా.. మీడియావినోద రంగాలపై కృత్రిమ మేధ చూపబోయే విప్లవాత్మక ప్రభావంపై ప్రత్యేక చర్చలుమాస్టర్‌క్లాసులుసాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారుఏఐ ఆధారంగా ప్రొడక్షన్ ప్రక్రియను వేగవంతం చేయడంబహుభాషా స్వర సాంకేతికతలుగేమింగ్ ఆవిష్కరణలుబాధ్యతాయుత ఏఐ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు ఇందులో ఉంటాయిమౌఖిక కృత్రిమ మేధ ఆధారిత మైక్రో డ్రామా కథనంఅడోబ్ భాగస్వామ్యంతో రూపొందించిన కథావతార్ (ఏఐతో రూపుదిద్దిన లఘుచిత్రాలు), చిత్ర నిర్మాణంలో పరిణామాలూ సాంస్కృతిక ప్రామాణికత వంటి అంశాలను స్పృశిస్తూ.. ఏఐ సాయంతో కథన ప్రక్రియపై శేఖర్ కపూర్ మాస్టర్‌క్లాస్... ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషాలుఎల్టీఎం బ్లూవర్స్ఏడబ్ల్యూఎస్ఎవర్‌జెంట్ భాగస్వామ్యంతో గూగుల్సోనీ రీసెర్చ్ ఇండియాపర్పుల్ టాక్డాష్ వర్స్పాకెట్ ఎఫ్ఎంకుకు ఎఫ్ఎంలుమికై వంటి సంస్థల సరికొత్త ఆవిష్కరణలను ఈ సదస్సుల్లో ప్రదర్శించనున్నారుఇవి పరస్పర వైజ్ఞానిక భాగస్వామ్యాన్నీవిధానపరమైన చర్చలనూ ప్రోత్సహించడంతోపాటు.. బాధ్యతాయుత ఏఐ సృజనాత్మక సేవల్లో భారత్ అగ్రగణ్యతను చాటుతాయి.

ఏఐ ఆవిష్కరణలను ప్రదర్శించనున్న 51 అంకుర సంస్థలు

ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026లో భారత ఏవీసీజీ-ఎక్స్ఆర్మీడియా సాంకేతిక రంగానికి చెందిన 51 అంకుర సంస్థలు వేవ్స్ క్రియేట్స్ కార్నర్‌లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయిలీనం చేసే కథనంగేమింగ్వర్చువల్ ప్రొడక్షన్నవతరం కంటెంట్ సాంకేతికతలు ఈ వేదికపై ఉంటాయిమానవ ప్రమేయం లేకుండా వార్తా విభాగంవివిధ భాషల్లో డబ్బింగ్ ఏఐ సంకేత భాషా అవతార్‌లతో కూడిన భాషా వాల్అలాగే సంవాద్ సేతుది డైరెక్టర్స్ చైర్ వంటి మౌఖిక కార్యక్రమాలుఏఐ పాడ్‌కాస్ట్ స్టూడియోసంభాషించగల మానవ రూప రోబోలువాయిస్ క్లోనింగ్ ఇందులోని ముఖ్యమైన అంశాలుభాషాసేతుకళాసేతు పోటీల విజేతలు కూడా తమ ఏఐ ఆధారిత సాధనాలను ప్రదర్శిస్తారుఇవి మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతోపాటు.. భాషా పరమైన అవరోధాలను తొలగించి సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాయితద్వారా సృజనాత్మక సాంకేతిక రంగంలో దేశ శక్తిని చాటుతాయి.

సృజన రంగంలో భారత్ సత్తా చాటేలా.. సమాచారప్రసార మంత్రిత్వ శాఖఅడోబ్ భాగస్వామ్యం

భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 సందర్భంగా.. కేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖ పెవిలియన్‌లోని వేవ్స్ క్రియేటర్స్ కార్నర్‌లో మంత్రిత్వ శాఖతో కలిసి అడోబ్ సంస్థ వరుసగా కృత్రిమ మేధ ఆధారిత సృజనాత్మక కార్యక్రమాలను ప్రదర్శించబోతోంది.

ఇందులో భాగంగా భారతీయ జానపద కథల స్ఫూర్తితో రూపొందించిన అయిదు ఏఐ లఘు చిత్రాల సమాహారం కథావతార్‌ను అడోబ్ ప్రదర్శించనుందిలాంగ్వేజ్ ఆఫ్ బర్డ్స్మిగోయ్ఉత్తరాయణది బార్బర్స్ సీక్రెట్యప్పాసారస్ చిత్రాలను ఈ సదస్సు సమయంలో వేవ్స్ క్రియేటర్స్ కార్నర్‌లోని ఏఐ థియేటర్‌లో ప్రదర్శిస్తారుకథనంలోనూసినిమా నిర్మాణంలోనూ కృత్రిమ మేధతో ప్రయోగాలు చేస్తున్న నవతరం భారతీయ దర్శకుల ప్రతిభను ఈ ప్రదర్శన చాటుతుంది.

సినిమా భవితఏఐసృజనాత్మకతనైపుణ్యం’ శీర్షికన ఓ ప్రత్యేక సదస్సును కూడా అడోబ్ సంస్థ నిర్వహించనుందిఏఐ చిత్ర నిర్మాణ పద్ధతుల్లో అధునాతన ధోరణులుసృజనాత్మక ప్రక్రియల్లో పరిణామాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

అంతేకాకుండా అడోబ్ సహకారంతో నడిచే కంటెంట్ క్రియేషన్ హబ్.. ఆధునిక కంటెంట్ సృజనకారుల కోసం రూపొందించిన ఏఐ-ఆధారిత వీడియో నిర్మాణ పద్ధతులను ప్రదర్శించనుందివేగవంతమైన ప్రొడక్షన్మెరుగైన సృజనభారీ స్థాయిలో కంటెంట్ రూపకల్పనను సులభతరం చేసే సరికొత్త సాధనాలపై ఇది అవగాహన కల్పిస్తుంది.

ఈ కార్యక్రమాల ద్వారా ఏఐ ఆధారిత సృజనలో పెరుగుతున్న దేశ అగ్రగణ్యతను చాటడంతోపాటు.. మీడియావినోద రంగాల్లో ఆవిష్కరణలను బలోపేతం చేయడం అడోబ్సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యం.

 

***


(రిలీజ్ ఐడి: 2228857) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada