ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుల్వామా ఘటనలోని వీర జవాన్లను స్మరించుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 FEB 2026 11:06AM by PIB Hyderabad

పుల్వామా ఘటనలో 2019లో ఇదే రోజున ప్రాణాలను అర్పించిన వీర జవాన్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. దేశం పట్ల వారికున్న అంకితభావం, పట్టుదల, వారు చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని, వారు చూపిన అసమాన ధైర్యం.. ప్రతి భారతీయుడికి శక్తిని కలిగిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

“2019లో ఇదే రోజున పుల్వామా ఘటనలో ప్రాణాలను అర్పించిన వీర జవాన్లను స్మరించుకుందాం. దేశం పట్ల వారికున్న అంకితభావం, పట్టుదల, వారు చేసిన సేవలు మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. వారి ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయి"


(రిలీజ్ ఐడి: 2228205) సందర్శకుల సూచీ సంఖ్య : : 80