ప్రధాన మంత్రి కార్యాలయం
బార్బడోస్ ఎన్నికల్లో ప్రధాని మియా అమోర్ మోట్‌లీ వరుసగా మూడో సారి
చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2026 12:17PM by PIB Hyderabad
బార్బడోస్ ఎన్నికల్లో వరుసగా మూడో సారి విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన ప్రధాని మియా అమోర్ మోట్‌లీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బార్బడోస్ దీర్ఘకాలిక మైత్రికి భారత్ ఎనలేని ప్రాధాన్యాన్నిస్తోందనీ, పరస్పర సహకారాన్ని వివిధ రంగాల్లోకి విస్తరింపచేసుకొంటున్నామనీ శ్రీ మోదీ అన్నారు. ‘‘2024లో భారత్-కేరికామ్ శిఖరాగ్ర సదస్సు సందర్బంగా మనం భేటీ అయిన సంగతిని నేను గుర్తు చేసుకొంటున్నాను. మన రెండు దేశాల ప్రజల హితాన్ని కోరుకుంటూ మన భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠపరుచుకోవడానికి ఆమెతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘ఎన్నికల్లో వరుసగా మూడో సారి గెలిచి, చరిత్రను సృష్టించినందుకు ప్రధాని మియా అమోర్ మోట్‌లీకి హృదయపూర్వక అభినందనలు.
బార్బడోస్ తో భారత్ తన దీర్ఘకాలిక మైత్రికి ఎంతో ప్రాధాన్యాన్నిస్తోంది.. ఈ మైత్రి వివిధ రంగాల్లో పరస్పర సహకారం రూపేణా నిరంతరాయంగా విస్తరిస్తోంది.
2024లో భారత్-కేరికామ్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మనం సమావేశమైన సంగతి నాకు జ్ఞాపకముంది. మన ప్రజల మేలు కోసం మన భాగస్వామ్యాన్ని మరింత దృఢపరుచుకోవడానికి ఆమెతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2227467)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13