ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై పరీక్షా పే చర్చ కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తూ రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 5:31PM by PIB Hyderabad

పరీక్షల సమయంలో విద్యార్థుల మానసిక శ్రేయస్సుకు పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఎలా పెద్దపీట వేస్తుందో, భయాన్ని వీడి నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందిస్తుందో వివరిస్తూ కేంద్ర సహాయమంత్రి డాక్టర్‌ సుకాంత మజుందార్‌ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘పరీక్షా పే చర్చ ఎల్లప్పుడూ పరీక్షల సమయంలో విద్యార్థుల మానసిక శ్రేయస్సుకే ప్రథమ ప్రాధాన్యతనిస్తుంది. ఇది భయాన్ని జయించి, నేర్చుకోవాలనే స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మనం పరీక్షల మయానికి చేరువవుతున్న తరుణంలో కేంద్ర సహాయ మంత్రి @DrSukantaBJP గారు రాసిన ఈ లోతైన కథనాన్ని తప్పక చదవండిధైర్యంగా పరీక్షలను ఎదుర్కోండి!’’

లింక్dailypioneer.com/news/the-spirit-of-pariksha-pe-charcha (నమో యాప్‌ ద్వారా)

 

***


(రిలీజ్ ఐడి: 2227294) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Malayalam