ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 13న సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2ని ప్రారంభించనున్న పీఎం

భారతదేశ పరిపాలనా వ్యవస్థ నిర్మాణంలో విప్లవాత్మక ఘట్టాన్ని సూచించే ప్రారంభోత్సవం

సేవా తీర్థ్‌లో ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సచివాలయం

కర్తవ్య భవన్-1, 2లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,

విద్య మంత్రిత్వ శాఖతో సహా పలు కీలక మంత్రిత్వ శాఖలు

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 12:02PM by PIB Hyderabad

ఫిబ్రవరి 13, 2026న మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు సేవా తీర్థ్ భవన సముదాయం పేరును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారుఅనంతరం ప్రధానమంత్రి.. సేవా తీర్థ్కర్తవ్య భవన్-1, 2లను అధికారికంగా ప్రారంభిస్తారుసాయంత్రం సుమారు గంటలకు సేవా తీర్థ్ వద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ ప్రారంభోత్సవం భారతదేశ పరిపాలనా వ్యవస్థ నిర్మాణంలో విప్లవాత్మక ఘట్టాన్ని సూచించటమే కాక.. ఆధునికసమర్థవంతమైనసులభతరమైనపౌరులే కేంద్రంగా పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వ కీలక కార్యాలయాలుమంత్రిత్వ శాఖలు దశాబ్దాల తరబడి సెంట్రల్ విస్టా ప్రాంతంలో పలుచోట్ల పాతవేర్వేరు భవనాల్లో పనిచేశాయికార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉండటం వల్ల పరిపాలనా సామర్థ్యం తగ్గటంసమన్వయ లోపాలునిర్వహణ ఖర్చులు పెరగటంఅసౌకర్యవంతమైన పని వాతావరణ వంటి సమస్యలు తలెత్తాయిఈ సమస్యలకు పరిష్కారంగా కొత్తగా నిర్మించిన భవన సముదాయాలు.. పరిపాలనా విధులను ఆధునికభవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాయి.

గతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయంజాతీయ భద్రతా మండలి సచివాలయంకేబినెట్ సచివాలయాలు ఇకపై సేవా తీర్థ్‌లో ఉంటాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖరక్షణకుటుంబ సంక్షేమకార్పొరేట్ వ్యవహారాలువిద్యసంస్కృతిన్యాయసమాచారప్రసార మంత్రిత్వ శాఖవ్యవసాయరైతు సంక్షేమరసాయనాలుఎరువులుగిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో సహా పలు కీలక మంత్రిత్వ శాఖలు కర్తవ్య భవన్-1, 2లో ఉంటాయి.

ఈ భవన సముదాయాల్లో డిజిటల్ సదుపాయాలున్న కార్యాలయాలుపౌర సేవా విభాగాలుకేంద్రీకృత రిసెప్షన్ సౌకర్యాలున్నాయిఈ ప్రత్యేక వసతులు ఉద్యోగుల మధ్య సహకారాన్నిపనితీరులో సామర్థ్యాన్ని పెంపొందించటమే కాకపారదర్శకమైన పాలనమెరుగైన పౌర భాగస్వామ్యంఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడతాయి. 4 స్టార్ గృహ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ భవనాల్లో పునరుత్పాదక ఇంధన వ్యవస్థలునీటి సంరక్షణ చర్యలువ్యర్థాల నిర్వహణ పరిష్కారాలుఅత్యుత్తమ నిర్మాణ శైలి వంటి పర్యావరణహితమైన వసతులున్నాయిఈ చర్యలు పర్యావరణంపై ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడమే కాకపనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయిఈ భవన సముదాయాల్లో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్నిఘా వ్యవస్థలుఅత్యాధునిక అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాల వంటి సమగ్ర భద్రతా వ్యవస్థలున్నాయిఇవి అధికారులుసందర్శకులకు సురక్షితమైనసౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

 

***

 


(రిలీజ్ ఐడి: 2227051) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam